టీవీ: తప్పని తెలిసినా తప్పట్లేదు అంటున్న సిరి..!!

Divya
బిగ్ బాస్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ బరితెగించేసింది అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమె చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అంటే ఎందుకో వారిద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడిందట. ఇక సిరి కి ఎమోషన్ వచ్చిందట.. తప్పని తెలిసినా కూడా ఆమె తనతో రొమాన్స్ చేస్తోందట అంతేకాదు ఎవరేమనుకున్నా పర్లేదు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది సిరి హనుమంతు.
బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్నుల పరిస్థితి విషయంపై నాగార్జున వీకెండ్లో ప్రశ్నించారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ మీద నాగార్జున ఎటువంటి కామెంట్ చేయలేదు.. సిరి తనను తాను గాయపరచు కోవడం.. సిరిని షన్ను అలా ప్రేరేపించడం ఇక షన్ను ప్రవర్తనపై ప్రశ్నించాడు నాగార్జున.. అంతేకాదు నాగార్జున మాట్లాడుతూ.. మీరు ఎవరితో ఎలా ఉన్నా కూడా నేను ప్రశ్నించను.. కానీ మిమ్మల్ని మీరు హార్ట్ చేసుకోకండి , గాయపరచు కోకండి అంటూ నాగార్జున తెలిపాడు. ఇకపోతే శనివారం రోజున టాస్క్ పూర్తయిన తర్వాత సిరి ని పిలిచి నీ బాధ ఏంటి.. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటూ అడిగాడు.
అందుకు సిరి నేను చాలా ఎమోషన్..ఎందుకు అంత ఎమోషన్ వస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు.. కానీ ఎదుటి వాళ్ళను నేను ఎప్పుడూ హర్ట్ చేయను.. ఎవరు నన్ను హర్ట్ చేసినా నేనే హర్ట్ అవుతాను.. నా గతం ఏంటో నాకు తెలుసు ..నేను ఏంటో నాకు తెలుసు.. కానీ మా ఇద్దరి మధ్య సడన్గా ఎందుకు ఈ కనెక్షన్ వస్తుందో నాకు తెలియడం లేదు.. ఇది తప్పా అని కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను.. ఇక చూసే వారు ఎలా అనుకుంటారో అని కూడా నేను ఆలోచించడం లేదు.. ఇక నేను చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పటికీ కూడా చేస్తున్నాను.. ఎలా అర్థం చేసుకుంటారు అని కూడా నేను ఆలోచించడం లేదు అంటూ బరితెగించి సిరి  చెప్పేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: