బిగ్ బాస్ 5: ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ ఒక గుణం పాఠం...?

VAMSI
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలవ్వడం అయ్యింది, అపుడే సగంకి పైగా ఎపిసోడ్లు అవ్వడం అయ్యింది. అసలు నిన్న మొన్న ప్రారంభమయ్యిందేమో అనిపిస్తున్న బిగ్ బాస్ షో నుండి ఇప్పటికే పదిమంది ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి బిగ్ బాస్ హౌజ్ తో ఎన్నో అనుబంధాలు, ఎన్నో జ్ఞాపకాలు. ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే హౌజ్ లో మిగిలి ఉండగా నేడు ఇంకొకరు వెళ్లాల్సి ఉంది. అయితే కెప్టెన్ గా ఉన్న రవి మినహాయించి మిగిలిన వారంతా నామినేట్ అయ్యి ఉన్నారు. కాగా ఇపుడు ఈ రోజు హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి ఎగ్జిట్ అవ్వబోయేది ఆనీ మాస్టర్ అంటూ వార్తలు జోరుగా ప్రచారమౌతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ ఎలిమినేషన్ లీక్స్ దాదాపు అన్ని కూడా నిజమయిన క్రమంలో ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ కూడా వాస్తవమేనని తెలుస్తోంది.
అయితే ఈమె ఇంటి నుండి వెళ్లిపోవడానికి పలు స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా కాజల్ ని, సన్ని ని చులకన చేసి మాట్లాడుతూ ఉండటం. కాజల్ ని ఎప్పుడూ కూడా వెక్కిరిస్తూ ఉండటం. మొదట్లో గ్రూప్ లు గా అడుతున్నారంటూ ఇలా ఉంటే వ్యక్తిగతంగా ఆడే నాలాంటి వారు ఎప్పటికీ కెప్టెన్ అవ్వలేరంటూ, సన్ని, కాజల్, మానస్ గ్రూప్ ని అలాగే జెస్సీ, షన్ను, సిరి గ్రూప్ లను ఉద్దేశిస్తూ చేస్తూ మాట్లాడే ఆనీ మాస్టర్ ఈ మధ్య సిరి వాళ్ళ గ్రూప్ లో ఒకరిగా కలసి పోయి సన్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడంతో ఆమె కాస్త నెగెటివిటీని మూటకట్టుకున్నట్లు తెలుస్తోంది.
అలా ఇవన్నీ కలిసి ఆమె హౌజ్ లో నుండి ఎలిమినేట్ అయ్యేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు. ప్రచారానికి తగినట్లే జరుగుతుందా లేదా గత వారం లాగా బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా అన్నది చూడాలి. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి. ఈ ఎలిమినేషన్ హౌస్ ల ఉన్న మిగతా వారికి ఒక గుణపాఠం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: