టీవీ: తెలుగు టీవీ సీరియల్స్.. టీఆర్పి రేటింగ్స్.. టాప్ లో ఉన్న సీరియల్ ఏమిటంటే..?

Divya
తెలుగు టీవీ సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీటి యొక్క టీఆర్పీ రేటింగ్ విషయంలో కూడా వీటికి గట్టి పోటీ ఉంటుంది. వీటిలో స్టార్ మా ఛానల్ కు సంబంధించిన సీరియల్స్ టాప్ 6 లో ఈసారి నిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మొదటి స్థానంలో కార్తీకదీపం సీరియల్ ఉండగా,  తాజా టిఆర్పి రేటింగ్ లో ఇప్పుడు మెరుగైన రేటింగును సాధించడంతో రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు వంటి సీరియల్ కంటే ప్రస్తుతం మెరుగుదశలో ఉన్నది.

స్టార్ మా చానల్స్ టీఆర్పీ రేటింగ్ కు తిరుగులేకుండా ఉన్నది. 2024 మొత్తం 10 టాప్ సీరియల్స్ లో ఆ ఛానల్ సీరియల్స్ ఇప్పుడు టాప్ లో ఉంటూ వచ్చాయి చివరిదైనా 52వ వారం కూడా టాప్ సిక్స్ లో స్టార్ మా సీరియల్స్ ఉండడం గమనార్హం. ఇకపోతే బ్రహ్మముడి తర్వాత తొలి స్థానంలో ఉంటూ వస్తున్న కార్తీకదీపం సీరియల్ తాజాగా 13.51 రేటింగ్ తో మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. 12.29 రేటింగ్ తో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 11.15 రేటింగ్ తో చిన్ని సీరియల్ మూడో స్థానంలో నిలవగా,  10.45 రేటింగ్ తో ఇంటింటి రామాయణం నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక తర్వాత 10.19 రేటింగ్ తో మగువ ఓ మగువా,  10.14 రేటింగ్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ 5, 6 స్థానాలలో నిలిచాయి.

జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. మేఘసందేశం సీరియల్ ఈ వారంలో కూడా టాప్ లోనే నిలిచింది. ఈ సీరియల్ కి 8.05 రేటింగ్ లభించింది. రెండవ స్థానంలో పడమటి సంధ్యారాగం 7.32 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక 7.14 రేటింగ్ తో నిండు నూరేళ్లు సావాసం, 6.39 రేటింగ్ తో జగద్దాత్రి, 6.16 రేటింగ్ తో త్రినయని సీరియల్స్ ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: