బిగ్ బాస్ 5: సన్నీకి మూవీ ఛాన్స్... ఆనందంలో ఫ్యాన్స్?

VAMSI
బిగ్ బాస్ హౌజ్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజె సన్నికి సినిమాలో మంచి అవకాశం వచ్చినట్లు సమాచారం. ఓ యంగ్ హీరో చిత్రంలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ కి సన్ని సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. కామెడీ యాంగిల్ ఎక్కువగా ఉండే ఆ పాత్రకి కొత్త నటుడి కోసం చూస్తుండగా సన్నిని సజెస్ట్ చేశారట ఆ హీరో. ఆ లెవల్ కి సన్ని క్రేజ్ పెరగడం విశేషం. అయితే ప్రస్తుతం సన్ని హౌజ్ లో ఉన్నా మూవీ స్టార్ట్ అయ్యేటప్పటికి సీజన్ ఫైవ్ అయిపోతుందని, కాబట్టి ప్రాబ్లం ఉండదని ఒకే చేసినట్లు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. సన్నికి ఆల్రెడీ యాక్టింగ్ పై మంచి పట్టు ఉంది. "కళ్యాణ వైభోగం" వంటి సీరియల్స్ లలో హీరోగా కూడా చేశారు. ఈ హీరోలో కామెడీ యాంగిల్ కూడా చాలా దాగి ఉందని బిగ్ బాస్ హౌజ్ కి వచ్చాకే తెలిసింది.
బిగ్ బాస్ హౌజ్ లోకి ఒక్కసారి అడుగు పెడితే చాలు, ఇక ఆ సెలబ్రిటీ రేంజ్ హై పవర్ లా అలా పెరిగిపోవాల్సిందే. పెద్దగా గుర్తింపు లేని వారైనా సరే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాక పాపులారిటీ పెరగడం మాత్రం ఖాయం. అరియాన, సోహెల్, హారిక, అఖిల్, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ఎందరో బిగ్ బాస్ కి వెళ్లి పాపులారిటీ పెంచుకుని కెరియర్ లో దూకుడు పెంచారు. సినిమా ఆఫర్లు సైతం అందుకున్న వారు ఉన్నారు. అరియనా వరుసగా ఇండస్ట్రీలో ఛాన్స్ లు పొందుతూనే ఉంది. రాహుల్ కి అవకాశాలు పెరిగాయి. అన్షు కూడా షోలు చేస్తోంది. ఇలా చాలా మంది బిగ్ బాస్ సెలబ్రిటీలుగా దక్కిన  క్రేజ్ తో ఇండస్ట్రీలో ఆఫర్లు అందుకుంటున్నారు.
ఇపుడు సీజన్ ఫైవ్ మొదలయ్యి అంతే స్పీడుతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా ఈపాటికే సగం రోజులు పూర్తయ్యాయి. మొత్తం 19 మంది సభ్యులు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగా, ప్రస్తుతం తొమ్మిది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎవరికి వారు తమ టాలెంట్ తో తమ క్రేజ్ ను రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మధ్య సన్నీకి మాత్రం పాపులారిటీ అలా పెరిగిపోతుంది. హౌజ్ లో సన్నిని కావాలనే కార్నర్ చేస్తున్నారు. దీనికి తోడు తనకున్న ఆవేశం కారణం అవుతోంది. ఇది ప్రెకషకుల్లో విపరీతమైన సింపతీని క్రియేట్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా సన్నీ కావాలని ఎందరో కోరుకుంటున్నారు. వారందరికీ సన్నీ హీరో కావాలని, సినిమాలు చేయాలనీ ఆకాంక్షిస్తున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్న ఈ గాసిప్ నిజం కావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: