బిగ్ బాస్ 5: శ్రీరామ్ ఈ తప్పులు చేయకుంటే టైటిల్ విన్నర్?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి అప్పుడే 50 రోజులు అయిపోయింది. రోజులు గడిచే కొద్ది సీజన్ 5 విన్నర్ ఎవరవుతారు అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. తమ తమ ప్రియతమ ఇంటి సభ్యుల గెలవాలని కోరుకుంటున్నారు. టాప్ 5 లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లేంటో ఇపుడు చూద్దాం. శ్రీ రామ్ చంద్ర, రవి, యాని మాస్టర్, సన్ని ఇంకా మానస్. అయితే శ్రీ రామ్ చంద్ర మొదట్లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారాడనే చెప్పాలి. మొదట్లో మిగిలిన ఇంటి సభ్యులను కాస్త ఇగ్నోర్ చేస్తూ కనిపించిన రామ్ ఆ తరవాత మెల్ల మెల్లగా ఇతరులతో మింగిల్ అవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హమీదాతో కాస్త ఎక్కువగానే చనువుగా కనిపించాడు ఈ సింగర్.

కొందరికి ఇది మంచి ఎంటర్టైనింగ్ గా అనిపించినా చాలా మందికి మాత్రం ఏంటి ఈ గోల అనేలా కనిపించింది. మొత్తానికి హమీదా హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో బాగా డల్ అయిపోయాడు. దాంతో  రామ్ అభిమానులు తలలు పట్టుకున్నారు. మళ్ళీ ఎలాగోలా సెట్ రైట్ అయిపోయి అసలు గేమ్ ను అడటం మొదలెట్టాడు ఈ గాయకుడు. ఇంకేముంది తిరిగి అతడి ఫ్యాన్స్ ముఖంలో కొత్త వెలుగులు కనిపించాయి. చిన్న చిన్న వివాదాలు, సపోర్టింగ్, పోటీతత్వం ఇలా గేమ్ కి కావలసిన దాదాపు అన్ని యాంగిల్ ను కనబరుస్తున్నారు. కానీ టైటిల్ కొట్టాలంటే మాత్రం రామ్ ఇంకా తనని తాను మార్చుకోవాలి అంటున్న నెటిజన్ల అభిప్రాయాలు ఇపుడు చూద్దాం.

టాస్క్ ల సమయంలో మానస్, సన్నిల పైన మాత్రమే ఫోకస్ పెట్టడం పక్కన పెట్టి అందరి పోటీదారులను సమానంగా చూస్తూ తాను నెగ్గడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక కొన్ని సార్లు తను ఇతరులను వారి వీక్ పాయింట్ ను టార్గెట్ చేసి మరీ చాలా సిల్లీగా మాట్లాడుతూ వారికి ఆగ్రహం తెప్పించేలా  చేయడం చూసే వారికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్.. సన్నీని కావాలని రెచ్చగొడుతున్నారు అన్న మాటలు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సన్ని కి ప్లస్ అవుతుంటే రామ్ కి మైనస్ అవుతున్నాయి. ఇక ఇవి తప్ప మిగిలిందంతా పర్ఫెక్ట్ గా ఉందని..కొన్ని మార్పులు చేసుకుంటే శ్రీ రామ్ సీజన్ 5 టైటిల్ దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: