సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సుధీర్ రష్మి..!

N.ANJI
బుల్లితెరపై 
యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై వీరిద్దరు కనిపించని షోలు ఉండవు. బుల్లితెరపై పాపులర్ టీవీ షోలు జబర్దస్త్, ఢీ వంటి షోలో వీరిద్దరూ కనిపిస్తారు. ఇద్దరూ కలిసి స్టేజీపై సందడి చేస్తే చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఎందుకంటే వీరు చేసే పర్ఫార్మెన్స్ లో అంతటి కెమిస్ట్రీ ఉంటుంది. టీవీల్లో వీరిద్దరినీ చూస్తే ప్రేమికులు అనుకుంటారు. దర్శకనిర్మాతలు కూడా వీరిద్దరిపై స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు. సుధీర్, రష్మికి ఫ్యాన్ ఫాలొయింగ్ కూడా ఎక్కువే. సుధీర్‌ ను బుల్లితెర సూపర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు.
సుధీర్, రష్మి జోడి ఎంటనే విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకమే. వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు ఎప్పుడూ మనం వింటూనే ఉంటాం. అయితే ఇప్పటికే చాలా సార్లు వీరు తమ ప్రేమ విషయాన్ని ఖండిస్తూ.. ఇవి కేవలం రూమర్సేనని, మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కానీ, స్టేజీపై వీరిద్దరి లవ్ కెమిస్ట్రీ చూసి ఏదో ఉందనే డౌట్ పుడుతూనే ఉంటుంది. అయితే వీరిద్దరిపై పలు షోల్లో పెళ్లి ఈవెంట్లు కూడా చేశారు. ఈ పెళ్లి ఈవెంట్స్ చూసిన చాలా మంది రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు చూస్తే.. సుధీర్, రష్మిల నిశ్చతార్థం అయినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు వీళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారనే ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఫోటోలు నిశ్చితార్థంకు సంబంధించి కాదని తెలిసింది. ఒక షోలో షూటింగ్‌లో భాగంగా ఫోటోలు దిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరి జోడిని నిజ జీవితంలో ఒక్కటైతే చూడాలని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. వారిద్దరి మనసులో ఏముందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: