టీవీ: యమలీల ఫేమ్ చిన్ని రియల్ లైఫ్ స్టోరీ మీకు తెలుసా..?

Divya
బుల్లితెరపై ప్రముఖ టీవీ ఛానల్స్ తో ఈ టీవీ ఛానల్ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈటీవీ లో ఈ మధ్య కాలంలో వస్తున్న అన్ని సీరియల్స్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి.. మధ్యాహ్నం నుంచి మొదలయ్యే సీరియల్స్ రాత్రి 9 వరకు ప్రసారం అవుతూ బుల్లితెర టీవీ ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందిస్తున్నాయి. అలాంటి సీరియల్ లలో యమలీల సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ ఆలీ హీరోగా నటించిన యమలీల సినిమా తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ప్రస్తుతం సీరియల్ రూపంలో మనకు ప్రసారం అవుతోంది..
ఇందులో ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు ఆలీ కూడా ఆత్మ రూపంలో మనకు కనిపించి , తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇకపోతే ఈ సీరియల్లో అలీకి కూతురుగా చిన్ని పాత్రలో నటిస్తున్న అమ్మాయి గురించి మనం తెలుసుకుందాం. చిన్ని కూడా తన అందం, నటన, మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది.. ఇక ఈమె ఎవరు ఎక్కడినుంచి వచ్చింది ఇలా ఈమె రియల్ లైఫ్ స్టోరీ గురించి షార్ట్ గా తెలుసుకుందాం..
చిన్ని అసలు పేరు.. సోనియా సింగ్. 1998వ సంవత్సరం మార్చి 31వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఇక ఈమెకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సోనియాకు చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో తన స్కూలింగ్ , కాలేజ్ సమయంలోనే డాన్స్ పోటీలలో పాల్గొంటూ.. కొన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ కూడా చేసేది. ఇక కాలేజ్లో అయితే ప్రతి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చిన్ని పాల్గొనేది. సోనియా తన కెరియర్ ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలుపెట్టింది. అయితే ఎన్నో రకాల షార్ట్ ఫిలిమ్స్ లో నటించి సోషల్ మీడియా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న సోనియా.. యమలీల సినిమా ద్వారా మొదటిసారి సీరియల్ లో నటించడానికి అడుగు పెట్టింది. ఇక్కడ ఎంతో మంది అభిమానులను సోనియా  సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TV

సంబంధిత వార్తలు: