బిగ్ బాస్ 5: ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం సైలెంట్?

VAMSI
తెలుగు రాష్ట్రాలలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని నంబర్ వన్ షో గా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో అంటే అందరికీ ఎంతో ఆసక్తి. ప్రతి ఇంటి సందడి చేసే ఈ షో శని, ఆది వారాలలో డబుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేస్తుంది. అదేనండి శనివారం అయితే చాలు బిగ్ బాస్ స్టేజ్ పై నాగ్ కనిపిస్తాడు. అంతేనా అప్పటి వరకు ఇంటి సభ్యులు చేసిన మంచి పనులకు, పిచ్చి పనులకు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. ఇక ఆదివారం అయితే నాగ్ ఎవరు ఎలిమెంట్ అవబోతున్నారో అని చెప్తాడో అని ప్రేక్షకులకు తెగ కంగారు పడుతుంటారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పై ముందు నుంచి అంతా అనుకున్నట్లే హోస్ట్ నాగార్జునతో పాటు ఇద్దరు సెలబ్రిటీలు కూడా కనిపించి మురిపించారు.
అదేనండి మొదటి సినిమా ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకుని ఇపుడు రెండో చిత్రం కొండపొలం సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ మూవీ డైరెక్టర్... క్రిష్ విచ్చేసి అందరినీ తమ సినిమా విశేషాలతో అలరించారు. ఆ కాసేపు షో మొత్తం ఎంతో కలర్ఫుల్ గా కొత్తగా అనిపించింది. వైష్ణవ్ తేజ్ ని నాగ్ ఇంత చిన్న వయసులోనే రకుల్ తో ప్రేమేంటి తనని ప్రేమించడం ఎంటి అంటూ సరదాగా అడుగగా...అందుకు వైష్ణవ్ ప్రేమించాల్సి వచ్చింది తప్పలేదు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.  ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హమీద్, లోబో లు ఎలిమినేషన్ లో ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ అందరు టెన్షన్ పడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. దసరా పండుగ సందర్భంగా ఈవారం ఎలిమినేషన్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పండుగ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలి. కాబట్టి ఎలిమినేట్ చేసే ఎవరినీ బాధ పడేలా  చేయకూడదని ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం షాక్ అయినట్లు తెలుస్తోంది.  మరి ఇంకొద్ది గంటల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: