టీవీ: దేవత సీరియల్ సత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Divya
ఈ మధ్య కాలంలో సీరియల్స్ హవా రోజు రోజుకు పెరిగిపోతోంది అనే చెప్పాలి.. ముఖ్యంగా ఇప్పటి వరకు స్టార్ మా లో కార్తీకదీపం నాటిక మంచి టిఆర్పి రేటింగ్ సాధించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు సరికొత్తగా దేవత సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో ఉండే నటీనటులు అందంగా ఉండడమే కాకుండా తమ నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటారు. ఇకపోతే ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ లో వైష్ణవి ఎంతో అద్భుతంగా నటిస్తోందని చెప్పవచ్చు.

సత్య అనే క్యారెక్టర్ లో వైష్ణవి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. వైష్ణవి డిసెంబర్ 12 వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మెడికల్  రిప్రజెంటేటివ్.. తల్లి మంచి కాస్ట్యూమ్ డిజైనర్. వైష్ణవికి ఒక చెల్లి , తమ్ముడు కూడా ఉన్నారు. వైష్ణవి చెల్లెలు దుర్గా కూడా బంగారు పంజరం, సావిత్రమ్మ గారి అబ్బాయి అనే సీరియల్స్లో నటిస్తూ అక్క కు తగ్గ చెల్లి గా మంచి గుర్తింపు పొందుతోంది. ఈమె తమ్ముడు విజయ్ సిన్హా కూడా మంచి నటుడు అనే చెప్పాలి.

వైష్ణవి ఎంబీఏలో కరెస్పాండెన్స్ పూర్తి చేసింది.. అయితే నటన మీద ఆసక్తితో తన చదువులు పూర్తి చేసుకుని, మొదట డాన్స్  నేర్చుకుని ఆ తర్వాత బుల్లితెర కు వచ్చింది. వైష్ణవి మంచి డాన్సర్ గా కూడా గుర్తింపు పొందింది. ఎప్పుడైనా సీరియల్స్ షూటింగ్ లేని సమయంలో కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్ చేస్తూ తల్లికి తోడుగా ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె పనిచేసింది. అంతేకాదు సుడిగాడు , అల్లరే అల్లరి వంటి సినిమాల్లో కూడా నటించిన వైష్ణవి ఆ తర్వాత సినిమాలలో నటించడం ఇష్టం లేక బుల్లితెరపై సీరియల్స్ లో చేస్తూ ఇక్కడ మంచి గుర్తింపు పొందుతోంది.
జీ తెలుగు లో ప్రసారమైన పసుపు కుంకుమ అనే సీరియల్ ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసిన వైష్ణవి , ఆ తర్వాత అమెరికా అమ్మాయి, ఇద్దరమ్మాయిలు, అష్టా చమ్మా, సుందరకాండ, శిఖరం, కెరటం,మధుమాసం అనే సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: