బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ అయ్యేది అతడేనా?
సన్ని మాములుగానే కాస్త ఆవేశపరుడు అయినా నిన్న ఏమయ్యిందో ఏమో గానీ అంతమంది సిల్లీ రీజన్స్ చెబుతున్నా సైలెంట్ గా విని నవ్వుతూ ఉండిపోయాడు. పెద్దగా ఎవరినీ అపోజ్ చేయలేదు. దాంతో బయట ఆడియన్స్ లో సన్ని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటి సభ్యులంతా కలసి సన్నీని మాత్రమే కార్నర్ చేసేంత తప్పు అతడేమీ చేయలేదని బయట అంటున్నారు. అలా ఈ వారం సన్ని గ్రాఫ్ అలా ఒక్కసారిగా టాప్ కి చేరుకుంది. ఇక పోతే ఈ రోజు శనివారం నాగ్ బిగ్ బాస్ స్టేజ్ పై మెరిసే రోజు...అలాగే ఎలిమినేషన్ ఎపిసోడ్ కీలకమయ్యే రోజు. అయితే ఈసారి హౌజ్ నుండి బయటకు వెళ్ళేది నట్ రాజ్ మాస్టర్ అంటూ సమాచారం. ఇతడికి ఓటింగ్ చాలా తక్కువ వచ్చిందని తెలుస్తోంది.
భారీ డైలాగ్స్...ఇతరులను హార్ట్ చేసే మాటలు ఆయన ఆటిట్యూడ్ ల కారణంగానే ఈయనకు బయట క్రేజ్ తగ్గిందని అంటున్నారు. అంతే కాకుండా నాట్ రాజ్ మాస్టర్ వైఫ్ గర్భిణీ అని తెలిసిందే. తాను డెలివరీ టైం కు ఇంటికి వెళ్ళడానికి ఆశపడుతున్నాడనే కారణం కూడా ఉంది. మరి బిగ్ బాస్ ఎప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఇంకొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే విషయంపై ఒక క్లారిటీ రానుంది.