బిగ్ బాస్ 5: హమీదా గురించి మనసులో మాట చెప్పిన శ్రీరామ్?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 వారం వారంకు కొత్త కొత్తగా మారుతోంది. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కొన్ని సత్యాలు అందరికీ తెలిసాయి. బిగ్ బాస్ ఒక టాస్క్ లో బాగంగా ప్రేక్షకులను అలరించడానికి ఎంటర్టైన్మెంట్ షో ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా శ్రీరామ్ చంద్ర ఒక గెస్ట్ గా షో కు వస్తారు మరియు హోస్ట్ గా సన్నీ అతన్ని ఇంటర్వ్యూ చెయ్యాలి. మిగిలిన ఇంటి సభ్యులు ప్రేక్షకులుగా వ్యవహరిస్తారు. అంతే కాకుండా శ్రీరామ్ ను ప్రశ్నలు అడిగే అవకాశం వారికి బిగ్ బాస్ కల్పించాడు. బీబీ షో ను స్టార్ట్ చేసిన సన్నీ ఎంతో జోష్ గా శ్రీరామ్ ను వేదికపైకి ఆహ్వానించాడు. అయితే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సన్నీ అడిగిన ప్రశ్నలకు ఎంతో రియల్ గా శ్రీరామ్ చంద్ర సమాధానాలు ఇచ్చాడు.
ఇంటి సభ్యులు కూడా శ్రీరామ్ ను అనేక ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఎటువంటి సంకోచం లేకుండా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇంతలోనే శ్వేత వర్మ అడిగిన ఒక బోల్డ్ ప్రశ్నకు ఇంటి సభ్యులు, శ్రీరామ్ మరియు ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ శ్వేతా వర్మ అడిగిన ప్రశ్న ఏమిటంటే,  శ్రీరామ్ ఒకవేళ మీరు ఇక్కడున్న అమ్మాయిల్లో ఒకరోజు డేట్ కు వెళ్ళాలి అంటే ఎవరితో వెళతారు? అని అడిగినది. అయితే ఈ ప్రశ్నను ముందే ఊహించాడో ఏమో తెలియదు కానీ, కొంచెం ఆలోచించి... "హమీదా" అన్నాడు. షో చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా శ్రీరామ్ సమాధానానికి షాక్ అయ్యారు. ఇప్పటి వరకు ఎదో స్క్రిప్ట్ ప్రకారం వీరి మధ్య కెమిస్ట్రీ డెవలప్ అయిందని అనుకున్నారు.
కానీ నిన్ననే తెలిసింది ఇది స్క్రిప్ట్ కాదు. శ్రీరామ్ తన మనసులో హమీదా ఉందని, ఈ మాట విన్న హమీదా కూడా ఎంతో సిగ్గు పడిపోయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ షో అయిపోయేలాగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మరింత బలపడి అది ఇంకెంత దూరం వెళుతుందో అని ప్రేక్షకులు అంతా అనుకుంటున్నారు. కాగా ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున వచ్చేస్తారు. హౌస్ ను ఒక ఆర్డర్ లో పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: