బిగ్ బాస్ 5: కెప్టెన్సీ కోసం కనీరు పెట్టుకున్న సన్నీ...

VAMSI
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి అప్పుడే మూడు వారాలు దాటుతోంది. ఇంటి సభ్యులు ఒకరిని మించి మరొకరు స్ట్రాటజీ లతో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కాజల్ అయితే నాలుగు సీజన్లను బ్రేక్ లేకుండా చూసి బట్టి పట్టేసినట్టు ఉంది అంటున్నారు చూసిన వారంతా. ఇక ఆ సిరి అయితే గేమ్ పరంగా బాగానే అలెర్ట్ గా ఉంటుంది. కానీ పాపం ఆ లంకంత బిగ్ బాస్ హౌజ్ లో కూర్చోడానికి ప్లేసే దొరక్క పోయి పోయి ఆ షణ్ముఖ్ ఒళ్ళో కూర్చుంటుంది. అది కూడా ఆమెకు అతడి చేయి పట్టుకుని కూర్చుంటే కానీ అస్సలు బ్రెయిన్ ఆన్ అయ్యి మాటలు రావు అన్నట్టుగా చేస్తోంది. ఎప్పుడు చూసినా ఇద్దరు అయస్కాంతంలా అతుక్కునే కూర్చొని కనిపిస్తుంటారు.
ఇది నిజమో లేక జనాల దృష్టిని ఏదో ఒక రకంగా ఆకర్షించడానికి చేసే పనో అర్దం కావడం లేదు. ఇక నిన్న హౌజ్ లో విశేషాల విషయానికొస్తే....బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ మొదలెట్టారు బిగ్ బాస్. ఆ టాస్క్ లో ఎలాగో వారి తంటాలు వారి పడి చివరికి కెప్టెన్ పోటీదారులుగా సన్ని, శ్వేత వర్మ, శ్రీ రామ్ చంద్ర నిలిచారు. వీరి నడుముకి ఒక స్పాంజ్ బెల్ట్ ఇచ్చి ఇంటి సభ్యులు ఎవరినైతే కెప్టెన్ గా సపోర్ట్ చేయరో వారి బెల్ట్ పై కత్తితో పొడవాలి అని చెప్పారు. ఇలా అలా అందరి కన్నా ఎక్కువ సన్నికే కత్తి పోట్లు పడ్డాయి దాంతో సన్ని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వచ్చిన ప్రతి వాళ్లు మిగిలిన ఇద్దర్నీ వదిలేసి తననే టార్గెట్ చేస్తుంటే ఎలా ఉంటుంది మరి...అలాగే సన్ని కూడా పర్సనల్ గా హార్ట్ అయ్యాడు. నిజానికి సన్ని తనాల తాను ఉంటాడు. కోపం వచ్చినప్పుడు కోపాన్ని, అనందం అనిపిస్తే సంతోషాన్ని కురిపిస్తాడు.
అందుకే మిగిలిన వారు పెద్దగా మింగిల్ అవ్వలేకపోతున్నారేమో. చివరికి శ్వేత వర్మ బెల్ట్ కి శ్రీ రామ్ బెల్ట్ కి రెండు కత్తులు, మూడు కత్తులు, మిగిలిన అందరి కంటెస్టెంట్ లు కత్తులు  సన్ని బెల్ట్ కి పడటంతో మొదట సన్ని కి ఎక్కువ కత్తి పోట్లు రావడంతో గేమ్ నుండి అవుట్ అవ్వగా....ఆ తర్వాత శ్వేత లెక్కలోనుండి తప్పుకొగ చివరికి ఎక్కువమంది మద్దత్తు తో శ్రీ రామచంద్ర ఈ వారం ఇంటి సభ్యుడిగా సెలెక్ట్ అయ్యారు. దాంతో జశ్వంత్ కెప్టెన్ శ్రీరామచంద్రకు అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: