బిగ్ బాస్ 5: ఈ మాటలు నా బిడ్డకు తెలిస్తే ... నన్ను చెడుగా అనుకుంటుంది ?

VAMSI
బిగ్ బాస్ లో రాత్రి జరిగిన సంఘటనను 100 లో 99 మందికి నచ్చి ఉండదు. దీనికి కారణం ప్రియ ప్రవర్తించిన తీరు మరియు మాట్లాడిన మాటలు. ఒక సీనియర్ నటి మరియు హౌస్ లో వయసులో అందరి కన్నా పెద్ద అయిన ప్రియ ఈ విధంగా పరిణితి లేకుండా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనే విషయం ప్రియ ఆలోచించి ఉంటే అలా మాట్లాడి ఉండేది కాదేమో. అర్ధ రాత్రి లహరి రవితో బాత్రూం లో హగ్ చేసుకుంది అనే మాటను హైలైట్ చేస్తూ జరిగిన సంభాషణ అత్యంత బాధాకరం. ముఖ్యంగా మహిళాలోకం తల దించుకునేలా ఉంది.
ఇందులోకి రవిని లాగేటప్పటికీ ఒక్క సారిగా ఫైర్ అయిపోయాడు. మీరెలా మాట్లాడుతారు అక్కా...అంటూ ప్రియ పైన ఆవేశంతో ఊగిపోయాడు. హగ్ చేసుకుంటే తప్పు అనే అభిప్రాయం మంచిది కాదు అంటూ దుఃఖంతో బాధపడిపోయాడు. నాకు ఈ హౌస్ లో ఉన్న సిరి, శ్వేత అందరూ సిస్టర్స్ లాంటి వారే. అలా ఎలా ఆలోచించరు అక్కా... అంటూ ఎంతో కృంగిపోయాడు. ఇప్పుడు జరిగిన సీన్స్ మా పాప చూస్తే, ఈ వయసులో దానికి అర్థమైతే నన్ను ఎలా అనుకుంటుంది, సమాజం దృష్టిలో నేను ఎంత బ్యాడ్ అవుతాను అంటూ రోధించాడు.
హౌస్ లోని మిగతా సభ్యులు సైతం ప్రియ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్పారు. హౌస్ లో పర్ఫెక్ట్ గా ఉన్న వారిలో సన్నీ కూడా ఒకరు. ఇతను ప్రియని ఉద్దేశించి బాగా క్వశ్చన్ చేశాడు. హగ్ చేసుకోవడం తప్పు బిగ్ బాస్ రూల్స్ బుక్ లో లేదని, మీరు కొత్త రూల్స్ పెట్టొద్దని కడిగి పారేశాడు. మరి ఈ విషయంపై శనివారం నాగార్జున ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: