బిగ్ బాస్ 5:వారిద్దరి మధ్య శృతిమించుతోన్న వ్యవహారం... ?

VAMSI
నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు పంతం నీదా నాదా అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్ సభ్యులు రెండు వేరు వేరు టీములుగా విడిపోయి గేమ్ ను ఆడాల్సి ఉంది. టాస్క్ పూర్తయ్యే లోపు ఏ టీం వద్ద అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో ఆ టీం గెలిచినట్లు.  కాగా ఈ క్రమంలో ఒక టీం వద్ద నుండి మరో టీం పీల్లోస్ ను లాక్కొని తమ వద్ద టాస్క్ చివరి వరకు సురక్షితంగా ఎటువంటి డామేజ్ లేకుండా ఉంచాలి. అయితే టాస్క్ అలా మొదలైందో లేదో ఇంటి సభ్యులు ఇలా గేమ్ మొదలుపెట్టేశారు. వారు ఎక్కువ వీరు తక్కువ అని కాకుండా అందరూ గట్టి పోటీ ఇచ్చారు. షణ్ముఖ్ కూడా ఈ టాస్క్ లో గెలవాలన్న కసి చూపించాడు.  పరుగులు తీసి మరి పిల్లోస్ లాక్కోవడానికి బాగానే ప్రయత్నించాడు. సిరి పిల్లోస్ ను టీ షర్ట్ లో దాచుకుంది. 

వాటిని లాక్కోవడం కోసం సన్ని తనని గట్టిగా పట్టుకుని తన టీం లో ఉన్న లేడీస్ ని సిరి టీ షర్ట్ లో ఉన్న పిల్లోస్ తీసుకోమని అరుస్తాడు. అయితే ఇక్కడ సిరి స్క్రీన్ ప్లే చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సన్నీ పట్టుకుని తన టీం మెంబెర్స్ ని పిలుస్తుంటే, సిరి సన్ని పై విరుచుకుపడింది. పిల్లోస్ తీసుకునే క్రమంలో తన టీ షర్ట్ లోకి చేయి పెట్టాడు అంటూ గోల గోల చేసింది. దానికి సన్ని చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు.  కానీ సిరి అన్నట్టు జరగలేదని బిగ్ బాస్ కెమెరాలకు అలాగే షో చూస్తున్న ఆడియన్స్ కి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మరి సిరి ప్లే చేసిన ఉమెన్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవలేదనే చెప్పాలి. ఇక చివరకు రెండు టీం ల వద్ద సమానంగా పిల్లోస్ ఉండడంతో ఇరు టీం లను విన్నర్స్ గా ప్రకటిస్తారు బిగ్ బాస్.

ఇక టాస్క్ అయిందని అందరూ ఎవరికి వారు రిలాక్స్ అవుతుంటే శ్రీ రామ్ ఇంకా హమీదాలు మాత్రం కలసి రిలాక్స్ అయిన విధానం ఆడియన్స్ కి రొమాన్స్ టచ్ ఇచ్చింది. 
శ్రీ రామ్ ఏమో హమీదా వీపు నొక్కుతుంటే హమీదా చాలా కూల్ గా రిలాక్స్ అయ్యింది. ఒకరి చేతులు మరొకరు మసాజ్ చేసుకుంటూ అప్పటి బిగ్ బాస్ సీజన్ 3 తేజస్వి, సామ్రాట్ జంటని గుర్తొచ్చేలా చేశారు. ఈ ఎపిసోడ్ చూసిన కొందరు నెటిజన్లు వీరి వ్యవహారం రోజురోజుకి శృతి మించుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ముందు ముందు వీరిద్దరూ ఏమి చేయనుంది తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: