టీవీ: సీరియల్ నటి పల్లవిని అందుకే బ్యాన్ చేశారట..!

Divya
పల్లవి గౌడ.. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అని చెప్పవచ్చు. మొదట కన్నడ ఈటీవీ లో ప్రసారం అయిన మనే ఒండు మూర్ అని నాటికలో 2010వ సంవత్సరంలో కథానాయికగా నటించడానికి అడుగుపెట్టింది. 2010 సంవత్సరం నుంచి తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పల్లవి గౌడ, అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. 1993వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జన్మించిన పల్లవి గౌడ తెలుగు సీరియల్స్ కు పెట్టింది పేరు.. ముఖ్యంగా తన నటనతో చక్కగా హావ భావాలు పలికించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో ఈమె ఇండస్ట్రీ ప్రస్థానం విషయానికి వస్తే, 2011 సంవత్సరంలో మొదలైన సావిత్రి సీరియల్ లో  2014 సంవత్సరం వరకు నటించింది. ఇక 2014 తర్వాత సంవత్సరం తర్వాత తెలుగు సీరియల్స్ కు దూరమై కన్నడ , మలయాళం టీవీ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి అక్కడే సెటిల్ అయింది. ఇకపోతే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సూర్యకాంతం, చదరంగం అనే సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక పోతే ఈమె చదరంగం సీరియల్ లో కొంత వరకు నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈమెను  అప్పట్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు బ్యాన్ చేశారనే వార్తలు వినిపించాయి. వీటిపై ఈమె స్వయంగా స్పందించింది. 2011 సంవత్సరంలో తెలుగులో సావిత్రి సీరియల్ నటించడానికి పల్లవి గౌడను ఎంపిక చేసుకున్నప్పుడు,  ఒక అగ్రిమెంట్లో సైన్ కూడా తీసుకున్నారట.. అగ్రిమెంట్ లో ఏముందంటే.. సావిత్రి సీరియల్ నటించేటప్పుడు వేరే ఏ ఇతర సీరియల్స్లో కూడా నటించకూడదు అన్నట్టుగా అగ్రిమెంట్ ఉంది. పల్లవి కూడా  అందుకు ఒప్పుకొని సైన్ చేసింది. అయితే ఆ సీరియల్ నిర్మాతలు కూడా అదే అదునుగా తీసుకుని ఆమెకు రెమ్యునరేషన్ కూడా తక్కువగా ఇచ్చేవారట. ఇక దీంతో ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ,వేరే సీరియల్ లో నటించడానికి ఒప్పుకుంది..
ఇక దీంతో నిర్మాతల అగ్రిమెంటు ను బ్రేక్ చేసింది అంటూ కొద్ది సంవత్సరాల పాటు  ఆమెను బ్యాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం సూర్యకాంతం, చదరంగం సీరియల్స్ లో నటిస్తోంది పల్లవి. అంతేకాదు ఈమె యూట్యూబ్ ఛానల్ ని కూడా ఓపెన్ చేసి సిరీస్  లో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: