బిగ్ బాస్ 5: ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు అట్టహాసంగా ఆదివారం నుండి మొదలయింది. ఈ సారి ఏకంగా 19 మంది పోటీదారులు పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఒకేసారి ఇంత మంది పోటీదారులు పాల్గొన్నది లేదు. దీనితో హౌస్ అంతా గందరగోళంగా ఉంది. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల మధ్యన అప్పుడే చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి. ఇంటిలో ఉన్న సభ్యులలో దాదాపు అందరూ యువకులే కావడం వలన మనస్పర్ధలు వస్తున్నాయి. కాగా మొదటి వారం జరిగిన నామినేషన్ లో అయిదు మంది ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకున్నా తర్వాత అందరూ కలిసిపోయారు. కానీ మోడల్ జస్వంత్ మాత్రం కన్నీరు పెట్టుకోవడం కొంచెం విచారాన్ని కలిగించింది.  
అయితే నామినేషన్ లో ఉన్న ఆరు మందిలో యాంకర్ రవి, ఫమీదా, జస్వంత్, కాజల్ , మానస్ మరియు సరయు లు ఉన్నారు. కానీ ఈ ఆరు మందిలో రవి, సరయు, కాజల్, మానస్ లు స్ట్రాంగ్ గా ఉన్నారు. మరియు వీరికి బయట ఫ్యాన్స్ బలం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మొదటి వారమే నామినేషన్ లో ఉన్నా కూడా ఎటువంటి భయం కానీ బెరుకు కానీ లేకుండా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. అయితే కేవలం జస్వంత్ మరియు ఫమీదా లు మాత్రమే బాగా ఫంక్ అయ్యారు. వీరిలో నామినేషన్ లో ఉన్నామన్న భయం ప్రతి ఒక్క క్షణం క్లియర్ గా అర్థమవుతోంది.
కానీ ఈ వారం జరగనున్న ఎలిమినేషన్ లో ఎవరు బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నారు అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్ళేది జస్వంత్ అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి ఈ వార్త వినబడుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకో రెండు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: