టీవీ : వంటలక్క తిరిగొచ్చిన వేళ

Divya

భారతదేశంలోని బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న ఏకైక ధారావాహిక కార్తీకదీపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీకదీపం సీరియల్ ను  ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు అంటే, ప్రతిరోజూ సాయంత్రం ఏడున్నర గంటలు ఎప్పుడు అవుతుందా ?  అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతలా ఈ సీరియల్ కి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రతి రోజు స్టార్ మా లో సాయంత్రం 7:30 కు ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు రెప్పపాటు సమయాన్ని కూడా వదలడం లేదు.


దీప అమ్మ తనం గురించి కార్తీక్ కు నిజం తెలియడం, దీప అనారోగ్య సమస్య మరింత తీవ్రంగా మారడంతో మొత్తానికి సీరియల్ సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలను  కూడా బాగా ఆకట్టుకుంటోంది . ఇదిలా ఉంటే దీపకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కార్తీక్, సౌందర్య దగ్గర కూర్చొని తెగ బాధపడిపోతుంటారు. వారి దగ్గరకు దీప తండ్రి మురళీకృష్ణ రెండు బ్రెడ్స్ తీసుకొని వచ్చి, కార్తీక్ కి ఇస్తూ వుండగా ,అందులో ఒకటి మీరు తినండి మావయ్య అంటూ  అక్కడ నుంచి బయల్దేరాడు కార్తీక్. ఇక ఆ మాటను విని సౌందర్య  షాక్ అవుతూ  మురళీకృష్ణ ను చూడగా  అవునమ్మా ! నన్ను మావయ్య అంటూ పిలిచాడు అంటూ సంబరపడిపోతాడు.

కార్తీక్ దీప పై చూపిస్తున్న ప్రేమను చూసి, మోనిత తట్టుకోలేకపోతుంది. కార్తీక్  ప్రేమ కోసం ఎంత చేసినా కూడా ఏం లాభం లేదనుకుంటూ తన బతుకుకి  మోక్షం లేదని చనిపోవాలని అనుకుంటుంది. అప్పుడు అదే సమయంలో కార్తీక్ , మోనిత దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ ? అని ప్రశ్నిస్తాడు. దీప గురించి అని తను కవర్ చేయగా.. అప్పుడు దీప పరిస్థితి ఏంటి ,నా భార్య గురించి నాకు చెబుతే తట్టుకోలేను .. డాక్టర్ భారతి నీకేమైనా చెప్పిందా ? అంటూ, కావాలంటే ఢిల్లీ, ముంబై నుంచి డాక్టర్ ని కూడా పిలిపిస్తాను  అని కార్తీక్ అనడంతో మరింత రగిలిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: