టీవీ : బాస్ ఈస్ బ్యాక్.. ఇంద్రజ ఔట్..

Divya

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం లో ఎంతో మంది జడ్జీలు వచ్చినా, వెళ్ళినా సీనియర్ హీరోయిన్ రోజా తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అంతేకాకుండా జబర్దస్త్ కామెడీ షో లో బెస్ట్ జడ్జ్ ఎవరంటే రోజా  అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో జబర్దస్త్ షో కి రాలేకపోవడం వల్ల, ఆమె ప్లేస్ లో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రేక్షకులంతా జబర్దస్త్లో రోజా లేకపోవడంతో లోటుగా ఫీలయ్యారు. కానీ ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు.

ఇంద్రజ తన అందం, అభినయంతో పాటు జబర్దస్త్ పంచ్ లతో ఎంటర్టైన్మెంట్  ని అందించింది. దీంతో జబర్దస్త్ జడ్జ్ రోజా లేని లోటును పూర్తిస్థాయిలో భర్తీ చేసింది. ఇక రోజా అభిమానులు కూడా ఇంద్రజ రావడం తో  వారికి కొద్దిగ ఉపశమనం కలిగి ఉందనే చెప్పవచ్చు.. ఇంద్రజ కూడా ఏదో కొద్ది రోజులే కదా! వెళ్లొచ్చామా, పనైపోయిందా? అన్నట్టుగా కాకుండా స్కిట్స్ లో ఇన్వాల్వ్ అవుతూ, కంటెస్టెంట్స్ కి బూస్టింగ్ ఇస్తూ పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచుతూ, రోజా లేని లోటును తీర్చింది ఇంద్రజ.. ఇంద్రజ చేసింది కొన్ని ఎపిసోడ్లు అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.  దీంతో  ఈమె ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఫుల్ టైం కంటిన్యూ కావడం ఖాయం అని అనుకున్నారు అందరు. అయితే ఆ ఊహాగానాలను పక్కకి నెట్టింది జబర్దస్త్ జడ్జ్ రోజా..

రోజా అనారోగ్యం నుంచి తిరిగి కోలుకోవడంతో ఇక జబర్దస్త్ లో సరికొత్త లుక్ తో ఎనర్జిటిక్గా ఎంట్రీ ఇచ్చింది.. జబర్దస్త్ పంచులు వేస్తూ, రెట్టింపు ఉత్సాహంతో కంటెస్టెంట్స్ ని ఉర్రూతలూగించాడానికి సిద్ధం అయ్యింది.  ఇక తాజాగా మే 27 నాటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా, ఇందులో రోజా ఎంట్రీ ఇచ్చి అందరినీ అలరిస్తూ, తనదైన శైలిలో టీం లీడర్ ల పంచ్ లను ముందే చెప్పేస్తూ జబర్దస్త్ జడ్జి అనిపించుకుంటున్నారు..ఏది ఏమైనా జబర్దస్త్ జడ్జ్ ల స్థానంలో రోజా తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: