అత్త కోరికను జానకి తీరుస్తుందా.. ?

Satvika
కార్తీక దీపం సీరియల్ తర్వాత స్టార్ మాలో అంతటి ఆదరణ పొందుతున్న సీరియల్ జానకి కలగణలేదు.. ఓ  వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. క్యూట్ లవ్ స్టొరీతో పాటు ఒక భార్య ఆశయం, భర్త అమాయకత్వ ప్రేమ, గాంబిర్యమైన అత్త డామినేషన్, ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 44వ ఎపిసోడ్ ను ఒకసారి చూద్దాం..


జానకి మహా సిగ్గుతో నడుచుకుంటూ ఉంటే రామచంద్ర ఆమె కంటే ఎక్కువ సిగ్గుతో కనిపిస్తాడని అందరికి తెలిసిందే.ఇక ఈ అందమైన అమాయక ప్రేమలో అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. తన భార్యకు ఇష్టమైన ఒక నెక్లెస్ ను బహుమతిగా ఇవ్వడానికి సిగ్గు పడే రామచంద్ర పనిమనిషితోనే ఆ కానుకను పంపిస్తాడు.జానకి ఒకప్పుడు ఒక షాప్ లో ఇష్టపడిన ఆ నెక్లెస్ విషయాన్ని గుర్తు చేస్తూ నువ్వు నా జీవితంలో రాకముందే ఆ బహుమతిని తీసుకున్నట్లు చెబుతాడు. అప్పుడు పని మనిషి ఇచ్చిన ట్విస్టుతో రామ్ వచ్చి జానకి మెడలో ఆ నెక్లెస్ వేయాల్సి వస్తుంది.


ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరినొకరు అనుమతి తీసుకుంటూ నడిచే ఆ సన్నివేశం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..ఇక వైజయంతి మనవరాలు పుట్టిన సందర్భంగా వేడుకకు పిలవడంతో అక్కడ ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానాంబ చాలెంజ్ కూడా విసురుతోంది. కౌన్సిలర్ సునందా దేవి కోసం వైజయంతి ఎదురుచూస్తుండగా ఆమె తనయుడు వచ్చి అమ్మ ముఖ్యమైన పొలిటికల్ మీటింగ్ వల్ల రాలేదు అని చెబుతాడు. ఇక పాత గొడవలను గుర్తు చేసుకొని అతను జ్ఞానాంబ పై కోపంగా ఉంటాడు.


వేడుకలో అంతా సక్రమంగా జరుగుతున్న క్రమంలో వైజయంతి, జ్ఞానాంబల మధ్యలో మాటలు కొనసాగుతాయి. మరీ మీ ఇంట్లో ఎప్పుడు బారాసలకు పిలుస్తావు అంటూ రెచ్చగొడుతుంది. ముందుగా వచ్చిన చిన్న కోడలే వరాసుడిని ఇవ్వలేదు ఇక పెద్ద కోడలు ఎప్పటికి ఇస్తుందో అన్నట్లు అనగా.. దానికి జ్ఞానాంబా మాత్రం ఏడాది తిరిగే లోపు పిల్లలు పుడతారని అంటుంది..కట్ చేస్తే.. 45వ ఎపిసోడ్ లో దొంగతనం జరుగుతుంది. ఆ సీన్ తో ఇక సీరియల్ ఎలా సాగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: