బుల్లితెర బాహుబలి కార్తీకదీపం సీరియల్ లో మరో ట్విస్ట్ రానుందా..? దీప తన అత్తింటిని వదిలేసి మళ్ళీ శ్రీరామ్ నగర్ బస్తీకే వెళ్లనుందా..? సీరియల్ కి ముగింపు వస్తుందని అందరి భావిస్తున్న సమయంలో మళ్ళీ కథ మొదటికే వచ్చిందా? అని అడిగితే అవుననే హిట్స్ వస్తున్నాయి. ఇటీవల వంటలక్క(ప్రేమీ విశ్వనాథ్).. సీరియల్ షూట్ లొకేషన్ కి సంబంధించిన వీడియోని యూట్యూబ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో దీప సరోజక్క, వారణాసిలతో కలిసి పాత ఇంట్లో స్వీట్స్ తయారు చేస్తున్నట్లు కనిపించింది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఆమె స్వీట్ షాప్ పెట్టినట్లు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. అయితే ఆ విషయం పక్కనపెడితే దీప మళ్ళీ తన ఇంటికి వెళ్లిపోవడం ప్రస్తుతం పలు చర్చలకు దారి తీస్తోంది.
రీసెంట్ ఎపిసోడ్స్ లో దీప పై డాక్టర్ బాబు కార్తీక్ విపరీతమైన ప్రేమ చూపించడం ప్రారంభించాడు. ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా డాక్టర్లు చెప్పడంతో కార్తీక్ ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభించాడు. ఒక సందర్భంలో దీప ను లాగి చెంపమీద కొట్టి.. మొగుడికే చెంప మీద కొట్టే హక్కు ఉంటుందని ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా వదిలాడు. దీంతో దీప, కార్తీక్ కలిసి పోయారు అని అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ షేర్ చేసిన వీడియో లో మళ్ళీ దీప తన భర్తనుంచి విడిగా ఉంటూ పాత ఇంటికి వెళ్లి పోయిందని.. మళ్ళీ కథ మొదటికే వచ్చిందని తెలుస్తోంది.
ట్రీట్మెంట్ తీసుకునేలా చేసేందుకు కార్తీక్ తాత్కాలికంగా భర్తగా మాత్రమే వ్యవహరిస్తున్నాడని మౌనిక దీప కి కాల్ చేసి చెప్పడం చూస్తుంటే డాక్టర్ బాబు, వంటలక్క కలవాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో వామ్మో, కార్తీక దీపం సీరియల్ లో మళ్ళీ ట్విస్టా.. అంటూ ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు.