జబర్దస్త్ లో నటించడం కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరి వచ్చిన నటుడు..!!

Mamatha Reddy
ఈరోజుల్లో గవర్నమెంట్ జాబ్ దక్కడం ఉంటే మహా అదృష్టం ఉంటేనే వస్తుంది అని చెప్పొచ్చు.. ఎన్నో ఏళ్ళు కృషి చేస్తే కానీ, ఎన్నో గంటలు శ్రమిస్తే కానీ గవర్నమెంట్ జాబ్ ఆఫర్ రాదు.. అలాంటి గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా.. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాసిపెట్టి ఉండాలి రా అంటూ పెద్దలు సామెత కూడా చెబుతుంటారు..అలా వదిలేసుకుననే వాళ్లను పిచ్చోళ్ళు కూడా అంటారు.. కానీ తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఒక కమెడియన్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చాడు..
ఇలాంటి ధైర్యాన్ని చేయాలంటే అది ఒక సినిమా వాళ్ళ వల్లే అవుతుంది.. సినిమా మీద ఉండే ప్యాషన్ తో వారు ఏ ఆఫర్ వచ్చినా ఇప్పుడే వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి క్లిక్ అయితే దాని కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వస్తాయి.. ఇంతకీ ఆ జబర్దస్త్ నటుడు ఎవరు అనుకుంటున్నారా.. ప్రస్తుతం తన కామెడీతో పంచులతో ప్రేక్షకులను అలరిస్తున్న నూకరాజు.. పటాస్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ మంచి మార్కులు కొట్టేసిన నూకరాజు జబర్దస్త్ లో కూడా చేస్తున్న విషయం తెలిసిందే..

జిగేల్ జీవన్ టీమ్ లో చేస్తున్న ఈ కుర్రాడు చూడడానికి సింపుల్ గా కనిపిస్తాడు కానీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం షాక్ అయిపోవాల్సిందే.. నటనా రంగం లోకి రాకముందు  ఏం చేస్తున్నారు అంటే విజయవాడ లో ఉద్యోగం చేసేవారు అని చెప్పుకొచ్చాడు.. ఏ ఉద్యోగం అంటే విజయవాడ పవర్ ప్లాంట్ లో పర్మినెంట్ జాబ్ అని చెప్పాడు.. అది వదిలేసి ఇక్కడికి వచ్చాడట నూక రాజు.. జబర్దస్త్ కోసం గవర్నమెంట్ జాబు వదిలేసి వచ్చారా అంటే అవును నటన మీద ఇష్టంతో గవర్నమెంట్ జాబు కూడా వదిలేసి వచ్చానని చెప్పాడు.. నూకరాజు తాను ఒప్పుకున్న షోలకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో జాబ్ కి రాజీనామా చేసినట్టు చెప్పాడు .. ఏదేమైనా కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో చిన్న రంగం కోసం వదిలేయడం గవర్నమెంట్ జాబు వదిలేయడం నిజంగా గొప్ప విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: