శ్రీముఖి ని సుధీర్ అంత మాట అన్నడుగా..!
ప్రస్తుతం రంగ్ దే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. నేడు విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. అయినా కూడా సినిమాను ఇంకాస్త ప్రమోట్ చేసుకుని వీకెండ్, హోలీ పండుగల ద్వారా గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బుల్లి తెర పైకి హీరో నితిన్ వచ్చి సందడిలో రచ్చ చేశాడు.శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్‌లందరూ కలిసి రంగు పడుద్ది అనే స్పెషల్ ఈవెంట్ ను హోలి నాడు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇందు లో సుధీర్ యాంకర్ గా వ్యవహరించాడు. శ్రీముఖి, అన్నపూర్ణ, రోహిణి, రాం ప్రసాద్, వర్ష, భాను అందరూ ఎవరికీ వాళ్ళే అన్నట్లు అయిపోయింది..
కేవలం ప్రోమో కే మంచి వ్యూస్ ను రాబట్టింది.నితిన్ ఫేమస్ పాటలకు అందరూ స్టెప్పులేశారు. నీ చేతి గాజులు ఘల్లుమన్నవే అంటూ శ్రీముఖితో నితిన్ డ్యాన్స్ చేశాడు. ఇక అందులో పిట్ట నడము అని రావడం, దాన్ని సుధీర్ పాయింట్ అవుట్ చేయడం హైలెట్ గా నిలిచింది. పిట్టనడుము అనుకుంటూ రింగ్ రోడ్‌ను చూపించారు.. జిత్తు మాస్టర్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టేజ్ మీదే ఎమోషనల్ అయిన నితిన్ తర్వాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించడం గమనార్హం.. మొత్తానికి ఈ షో మంచి బజ్ ను క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది..