హైపర్ ఆదిలో ఇలాంటి కోణం కూడా ఉందా..?. సాయం చేస్తున్నాడా ? లేక సంపాదిస్తున్నాడా ?
జబర్ధస్త్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతూనే.. సినిమాల్లోనూ అవకాశాలు పొందుతున్నాడు హైపర్ ఆది. అలా జబర్ధస్త్‌ను, సినిమా అవకాశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. తనతో పాటు తన టీమ్‌లోని మరికొందరికి అవకాశం ఇచ్చిన హైపర్ ఆది... వారిలో కొందరు ఇబ్బందులు పడినా.. మళ్లీ వారినే టీమ్‌లో కంటిన్యూ చేశారు. వాళ్లు ఎవరంటే దొరబాబు పరదేశి వైజాగ్ లో జరిగిన కేసులో వీళ్లు ఇరుక్కుకోగా. పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇక అందరూ వీళ్ళ పని అయిపోయింది వీళ్లను మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకోరు అనుకున్నప్పుడు హైపర్ ఆది ధైర్యం చేసి మళ్ళీ వాళ్ళని తన టీం లోకి తీసుకున్నాడు...
ఆ సంఘటన మీద కూడా కామెడీ చేస్తూ ఈ ఇద్దరికి పాపులారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో కొంతవరకు సక్సెస్ కూడా సాధించాడు. దొరబాబు సంగతి ఎలా ఉన్నా.. పరదేశీకి హైపర్ ఆది కొత్తరకం సాయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం యూట్యూబ్‌లో సొంత ఛానల్ స్టార్ట్ చేసిన పరదేశీ.. మొదట్లో హైపర్ ఆది హోమ్ టూర్ అంటూ ఆది ఇంటిని ఆడియెన్స్‌కు చూపించాడు. ఆ తర్వాత పరదేశి శేఖర్ మాస్టర్ తో డిన్నర్ చేసే వీడియో ని పెట్టాడు తర్వాత యాంకర్ వర్షిని తో లంచ్ వీడియోలు పెట్టాడు అయితే ఇవన్నీ చూస్తుంటే హైపర్ ఆది రికమండ్ చేస్తే నే శేఖర్ మాస్టర్ గాని వర్షిణి గాని ఆ వీడియోలు తీయడానికి అనుమతి ఇచ్చారు అని అందరూ అనుకుంటున్నారు ఆది వాళ్ల టీం సభ్యుడైన పరదేశి కోసం హెల్ప్ చేస్తున్నాడో లేదా ఆ వీడియోలు తో యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు సంపాదించడానికి అలా చేస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు అని జనాలు అందరూ అనుకుంటున్నారు...