వంటలక్క ప్లాన్ ఏంటి? ఏకంగా సుమ పోస్ట్ కే ఎసరు పెట్టిందా..!!

Satvika
బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అనడంలో అతిశయోక్తి లేదు.. ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక దీపం..సాధారణ అమ్మాయి తన భర్తను వేరే అమ్మాయి వల నుంచి ఎలా కాపాడుకుంటూనే వస్తుంది. తన మీద ఎన్ని రూమరస్ ను పెద్దగా పట్టిచ్చుకోదు..తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనుకుంటుంది .ఇపుడు సీరియల్ మరింత అందంగా తయారు అవ్వడం జరుగుతుంది ..కార్తీకదీపం సీరియల్‌లో తప్పా బయట ఎక్కడా కనిపించని ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడిప్పుడే రచ్చచేయడం ప్రారంభిస్తోంది. ఆ మధ్య దసరా ఈవెంట్ కోసం వచ్చింది. ఆ తరువాత ఓ మీడియా చానెల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా సుమ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ మధ్య మీడియా చానెల్‌లో వంటలక్కను సుమక్క ఇంటర్వ్యూ చేయడంతో బాగా వైరల్ అయింది. ఈ ఇద్దరి ప్రెజెన్స్‌తొనే ఓ కళ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేశారు. పైగా ఇద్దరూ మళయాలీలే. అలా కూడా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.తాజాగా మరోసారి సుమక్క, వంటలక్క కలిసి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం సుమక్కకు పోటీగా వంటలక్క నిల్చుంది. తెనాలి డబుల్స్ హార్స్ మినపగుళ్లు అని అంటే ఎవ్వరికైనా సరే యాంకర్ సుమ గుర్తుకు రావాల్సిందే. వీరిద్దరి మధ్య సంభాషణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత వంటలక్క వచ్చినా కూడా సుమ బ్రాండ్‌ను ఆమె స్థాయిని రీప్లేస్ చేయలేదు. ఇదే విషయాన్ని ఆ యాడ్‌లొనూ సూటిగా చెప్పేశారు. మొత్తానికి మంచి కాన్సెప్ట్‌తో యాడ్‌లో సుమక్క, వంటలక్కను బ్యాలెన్స్ చేశారు.యాడ్ గురించి వంటలక్క చెబుతూ ఉండగా.. నా స్థానానికి ఎసరు పెట్టింది ఎవరు అంటూ సుమ ఎంట్రీ ఇస్తుంది.. మీ లెవెలే వేరు అక్క అంటూ వంటలక్క సైతం సుమను పొగిడేస్తుంది. చివరికి యదావిధిగా సుమనే ముగించింది. మొత్తానికి సుమక్క, వంటలక్క ఒకే చోట కనిపించే సరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతు న్నారు. వీరిద్దరూ 
కలిసి ఈ యాడ్ చేయడం సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: