అరియనా బర్త్ డే కోసం అవినాష్ ఏం గిఫ్ట్ తెచ్చాడంటే..?
బయట కూడా ఈ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరనే కాదు బిగ్ బాస్ షో నాల్గో సీజన్ గడిచిపోయి నెల రోజులు దాటినా కూడా కంటెస్టెంట్ల హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. మొత్తానికి ఇప్పటికే ప్రతీ ఒక్కరూట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం.. లేదా.. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక మోనాల్, అఖిల్, సోహెల్, మెహబూబ్ వంటి వారంతా కలిసి రచ్చ చేస్తుంటారు. మరో వైపు లాస్య, హారిక, నోయల్ వంటి వారు.. ఇంకో వైపు అరియానా, అవినాష్‌లు కలిసి రచ్చ చేస్తుంటారు. అంతే కాకుండా స్పెషల్ ఈవెంట్‌లు, షోలతోనూ రచ్చ చేస్తున్నారు.అరియానా బర్త్ డే సందర్భంగా కొంత మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు రీయూనియన్ అయ్యారు. అరియానా తన ఫ్రెండ్స్‌కు లంచ్ పార్టీ ఇచ్చింది.ఇందులో లాస్య, సోహెల్, మోనాల్, మెహబూబ్ పాల్గొన్నారు.
అయితే లంచ్ పార్టీకి మాత్రం అవినాష్ హాజరుకాలేకపోయాడు.అవినాష్‌ను లంచ్ పార్టీకి ఆహ్వానించాను కానీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. అందుకే అంతగా పట్టించుకోలేదు.. రాలేకపోయాడంటూ లైవ్‌లో అరియానా క్లారిటీ ఇచ్చింది. కానీ అరియానా బర్త్ డేను మాత్రం అవినాష్ చాలా స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. అరియానా అవినాష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అరియానా కోసం స్పెషల్ కేక్ రెడీ చేయడం, స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం, అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగడంతో ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఇద్దరూ రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా అవినాష్ ఇచ్చిన సర్ ప్రైజ్‌లకు అరియానా ఎమోషనల్ అయింది.