సుధీర్ గురించి మనసులో మాట చెప్పిన రష్మీ..!
ఇక సుధీర్ తన సినీ ప్రయాణం గురించి మొదట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో చెబుతూ ఉండేవాడు. అయితే సుధీర్ జీవితాన్ని ఆధారంగా తీసుకోని ఢీ షో ఓ కొరియోగ్రాఫర్ ఓ పాటను చిత్రీకరించాడు. ఇక ఢీ షోలో కంటెస్టెంట్ తాజాగా చేసిన పర్ఫామెన్స్ అందర్నీ కంటతడి పెట్టించింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. సుధీర్ ఆ పర్ఫామెన్స్‌ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికీ నాకు ఇచ్చిన డెడికేషన్స్‌లో ఇదే బెస్ట్ అంటూ కంటతడి పెట్టాడు.
అయితే సుధీర్ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన వారిలో రష్మీ ఒకరు. ఈ ఇద్దరూ జబర్దస్త్ వేదికపై నుంచే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ జోడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఇదంతా అతని కష్టం, అతని ప్రయాణం, అతని బాధ అంటూ ఎమోషనల్ అయ్యింది రష్మీ. ఇక సుధీర్‌ను ప్రేమగా హత్తుకోవడంతో సెట్ అంతా సందడిగా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్ల అంత తమ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.