సద్దాం స్టోరీకి ఫిదా అయినా టీసీ.. అసలు ఎం చెప్పాడంటే..?

Suma Kallamadi
జబర్దస్త్, పటాస్, అదిరింది వంటి కామెడీ షోలతో పాపులర్ అవుతున్న కమెడియన్లు. బుల్లితెరపై హైపర్ అది తర్వాత కామెడీ టైమింగ్, పంచెస్ లో అంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సద్దాం హుస్సేన్. పటాస్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఇప్పుడు అదిరింది, ఇక పలు షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతేకాదు సద్దాం ఒక్కసారి స్టేజ్ పైకి వెళ్లాడంటే ఇక పంచులు వర్షమే.
అయితే సద్దం కాలేజ్ చదువుతున్నప్పుడు నా దగ్గర 270 రూపాయిలు ఉండటంతో కట్టుబట్టలతోనే హైదరాబాద్ వచ్చేశారు. ట్రైన్ ఎక్కా కాని.. టిక్కెట్ తీసుకోలేదు.. టీసీ కనిపించేసరికి బోగీ మారిపోయేవాడిని అన్నారు. హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ నగర్ ఆ తరువాత క్రిష్ణానగర్‌కి వెళ్లి అక్కడ అప్ కమింగ్ ఆర్టిస్ట్‌ల బాధల్ని చూశా అని అన్నారు. తన దగ్గర డబ్బులు అయిపోవడంతో తిరిగి ఊరు వెళ్లడానికి కాజీగూడా రైల్వేస్టేషన్‌కి వెళ్ళారంట. సద్దాం ఊరు వెళ్లే ట్రైన్ 4.30 ఉండేది. అయితే రైల్వే స్టేషన్‌లో నేను ఉండగా.. టీసీ పట్టేసుకుని టిక్కెట్ చూపించమన్నాడు.. టిక్కెట్ లేదు సార్ అంటే.. ఫైన్ కట్టమన్నాడంట.

అప్పుడు సద్దాం ఏడుస్తూ.. సార్ టీవీలో స్క్రిప్ట్ రైటర్స్ యాడ్ చూసి రూ. 10 వేలు తెచ్చి వాడికిచ్చా.. ఇప్పుడు ఇంటికిపోతే అమ్మావాళ్లుకొడతారు నేను చచ్చిపోతా అని స్టోరీ అల్లేశా.. వెంటనే ఆయన ఏమైనా తిన్నవారా? డబ్బులు వాడికెందుకిచ్చావ్.. పాగల్ గాడివా అంటూ రూ.50 నా చేతిలో పెట్టి ఏమైనా తినమన్నారు. అంతేకాదు ఆయన ఫోన్ నంబర్ రాసిచ్చి.. ఎవరైనా టిక్కెట్ లేదని పట్టుకుంటే నాకు ఫోన్ చేయమను అని చెప్పారు. అలా నా యాక్టింగ్‌తో నేను సంపాదించిన తొలి సంపాదన యాభై రూపాయలు. ఇప్పుడైతే నా సంపాదన దండిగానే ఉంది. ఎంతని చెప్పలేను కాని.. నేను కావాలనుకున్నదానికంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు కమెడియన్ సద్దాం హుస్సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: