ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కూలీ నుండి కోటీశ్వరుడి వరకు ఏమీ తేడా లేకుండా అందరిని తన కబంధ హస్తాలతో దాడికి దిగుతోంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ తేడాలు ఉన్నాయంటూ, పెద్ద సెలబ్రిటీలకు ఒక రకమైన ఆదరణ, చిన్న సెలబ్రిటీలకు మరొక రకమైన ట్రీట్మెంట్ అంటూ టెలివిజన్ ఇండస్ట్రీపై ఆరోపణలు చేశారు ప్రముఖ టీవీ యాక్టర్ శివ పార్వతి.
ఎన్నో సీరియళ్లలో ప్రముఖ పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు నటి శివపార్వతి... నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ దారి పట్టిన ఈమె ఎన్నో రకాల అద్భుత పాత్రలలో ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి టెలివిజన్ పై మెరిసారు... స్పెషల్ టీవీ షోలలో కూడా ఆడి పాడారు. ఈమె వయసు శరీరానికే కానీ మనసుకు కాదన్నట్టు చాలా హుషారుగా సరదాగా ఉంటారు. ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్ లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు శివ పార్వతి. అయితే రీసెంట్ గా ఈమె కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇదే విషయంపై శివ పార్వతి మాట్లాడుతూ.... చిన్న ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ అయినా ప్రాణం ఒక్కటే.
ప్రాణం పోతున్నా ఈ సమయంలో కూడా పట్టించుకోని తోటి నటుల సావాసం ఎందుకంటూ..? తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం, అభిషేక్ బచ్చన్, అమితాబచ్చన్, సింగర్ సునీత వంటి పెద్ద స్టార్లు కరోనా బారిన పడినప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలు వారికి సపోర్ట్ గా నిలబడుతూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేశారు... అంతేకాదు ప్రభుత్వం కూడా వీరి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును మే మే భరిస్తాం అంటూ ఈ పేద కళాకారుల పట్ల జాలి చూపారు..... ఇది బాగానే ఉంది... తప్పని కూడా నేను చెప్పను... కానీ మాలాంటి దిగువ శ్రేణి నటులను కూడా కరోనా బారిన పడినప్పుడు మమ్మల్ని గుర్తించి క్రిటికల్ సమయంలో సహాయ చర్యలను అందిస్తే బాగుండేది...
కరోనా వచ్చిన.. నా పరిస్థితి విషమించినా పట్టించుకునే నాధుడే లేక పోయాడు.
ఈరోజు జీవిత రాజశేఖర్ గారు నాకు అండగా లేకుంటే, నా ట్రీట్మెంట్ కోసం సహాయం చేసి ఉండకపోతే నా ప్రాణం గాలిలో కలిసిపోయివుండేది అంటూ.. అని తన దీన స్థితిని తెలిపారు శివపార్వతి... ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వదినమ్మ సీరియల్ టీం మెంబర్స్ కు నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ వచ్చి చాలా విషమించిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు... పది రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న సంగతి ప్రభాకర్ కి కూడా తెలుసు.... అయినా ఈ విషయంలో నేను ఎవరిని ఏమీ అనాలనుకోవడం లేదు... కేవలం థాంక్స్ మాత్రం చెప్పాలనుకుంటున్నా... ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి కారణంగా నాకు ఎవరేంటో వారి ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడే అర్థమైంది. ఏ ఆర్టిస్టు కూడా.. నేను హాస్పిటల్లో ఉన్నానో... ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు,ఇది చాలా దురదృష్టకరం. మీ తోటి నటి పట్ల మీరు చూపే శ్రద్ధ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు శివపార్వతి.