నేను పడక సుఖం కోసం ట్రాన్స్ జెండర్ గా మారలేదు: జబర్దస్త్ కమెడియన్...!

Suma Kallamadi
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు టెలివిజన్ ఛానల్స్ లో బాగా నవ్వు తెప్పించే కామెడీ షో ఏదంటే ఆలోచించకుండా చెప్పేది జబర్దస్త్. తాజాగా కరోనా నేపథ్యంలో మూడు నెలల పాటు షూటింగ్ జరుపుకున్న అన్ లాక్ మొదలైనప్పటి నుండి తిరిగి షోలను ప్రారంభించింది. అయితే నాగబాబు జబర్దస్త్ నుండి విడిపోయి జీ తెలుగులో అదిరింది షోలో జడ్జి గా వ్యవహరిస్తున్నారు. అయితే జబర్దస్త్ లో నాగబాబు రోల్ ను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో నిర్వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే.. జబర్దస్త్ కామెడీ షో లోనే కొందరు మగవారు ట్రాన్స్ జెండర్ గా మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సాయి తేజ అనే కమెడియన్ కూడా ట్రాన్స్ జెండర్ గా మారిన సంఘటన అందరికీ తెలిసిందే. అలా మారిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. ఇండస్ట్రీలోకి సాయి తేజ గా అడుగుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారానని తెలిపారు. ఇప్పుడు తన పేరు ప్రియాంక గా మార్చుకున్నట్లు తెలియజేశారు. ఇక ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ... ట్రాన్స్ జెండర్ గా మారాలని అనుకుంటే వెంటనే మారిపోవాలని తెలిపాడు. అయితే ట్రాన్స్ జెండర్ గా సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా రోజులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని తెలియజేశాడు.

అయితే తాను ట్రాన్స్ జెండర్ గా మారడానికి శృంగారం కోసం లేకపోతే పడక సుఖం కోసం కాదని నాకు చిన్నప్పుడు నుండి అమ్మాయి గా మారాలని కోరిక ఉండేదని ప్రియాంక తెలిపింది. చిన్నప్పటినుండి తనకి తన శరీరంలో మార్పులు గమనించినాని, 20 సంవత్సరాల తర్వాత తన శరీరంలో పూర్తి మార్పులను అనుగుణంగా ట్రాన్స్ జెండర్ గా మారినట్లు ప్రియాంక తెలియజేశాను. సినిమాలలో ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన తప్ప, మరొక విషయం గురించి తాను ఆలోచించని జబర్దస్త్ టీం సభ్యులు నేను అబ్బాయి గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో... ఇప్పుడు కూడా అందరూ అలానే కొనసాగుతున్నారని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: