రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్..!
అయితే రాజీవ్ చెల్లెలు శ్రీలక్ష్మీ కనకాల(40) చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌తో ఈ లాక్ డౌన్ సమయంలోనే కన్నుమూశారు. ఆ సమయంలో లాక్ డౌన్ నిబంధనలు కారణంగా రాజీవ్ కనకాల ఇంటికి ఎవ్వరూ రావ్వద్దని.. రాజీవ్ స్నేహితుడు నటుడు హర్ష వర్థన్ ప్రకటించారు. సినీపరిశ్రమకు సంబంధించిన పలువురు అంతా సామాజిక మాధ్యమాల సాయంతోనే సానుభూతి తెలిపారు. అయితే నిన్ను(ఆగస్ట్ 3) రాఖీపౌర్ణమి కావడంతో.. తన చెల్లెలు శ్రీలక్ష్మిని తలుచుకుంటూ రాజీవ్ కనకాల ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ఇలా తన బాధని అభిమానులతో పంచుకున్నారు.
రాజీవ్ ఆ పోస్టులో తన సోదరి తనపై చూపించే అనురాగానికి విలువ కట్టలేనన్నారు. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడుతుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదని తెలిపారు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను.’ అంటూ భావోద్వేగ పోస్ట్‌ని అభిమానులతో పంచుకున్నారు రాజీవ్ కనకాల. దీంతో పలువురు నెటిజన్లు.. ‘మీ చెల్లి ఏ లోకంలో ఉన్న మిమ్మల్నీ చూస్తూనే ఉంటుంది. ఆ బాధ మాటల్లో చెప్పలేం. తోబుట్టువులు అంటే క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవ్వరుంటారు?’ అంటూ అభిమానులు వారి నిర్ణయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.