అన్నం కోసమే ఇండస్ట్రీకి వచ్చారంటా వీళ్ళు..!

Suma Kallamadi

సినీ పరిశ్రమలోకి ఎవరైనా ఫ్యాషన్ తో వస్తారు. కానీ వీరు మాత్రం చిత్ర పరిశ్రమలోకి అన్నం కోసమే వచ్చారని తెలియజేశారు. వారు ఎవరో కాదండి రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఎవరు అనేది తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని అభిమానించే, ఆరాధించే ఫైట్ మాస్టర్స్. 

 

 

తెలుగులో దాదాపు ప్రతీ ఒక్క హీరోతో పని చేసిన వీరు. మాస్‌ను మెప్పించేలా యాక్షన్ సీక్వెన్స్ తీయడంలో ధిట్ట. ఓ సినిమాలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ కంపోజ్ చేశారని సాధారణ ప్రేక్షకుడు సైతం ఇట్టే గుర్తు పట్టేస్తారు. అది వారు పని చేయడంలో గొప్పతనం అని చెప్పొచ్చు. అయితే తాజాగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలీతో సరదాగా షోలో తమ జీవితంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి తెలియజేశారు.

 

 

అయితే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తమిళ, తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సాధారణ ఫైట్ మాస్టర్స్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన వీరు. హీరోలుగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిధాయకమే. తెలుగులో వీరు బస్తీమే సవాలే అనే చిత్రంలో హీరోలుగా నటించారు.

 

 

అయితే స్టార్ హీరోల చిత్రాల్లో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసే ఫైట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా బోయపాటి చిత్రాల్లో వీరిది మరో లెవెల్. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సింది. అంతలా పేరు తెచ్చుకున్న వీరు తమ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించారు.

 

 

అయితే ఓ సారి ఓ సినిమా షూటింగ్‌కు వెళ్తే అక్కడ అందరికీ ఐదు రకాలు వంటకాలతో కూడిన భోజనం పెట్టారట. అది చూసి.. ఆ భోజనం కోసమైనా సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అప్పట్లో తినడానికి కూడా ఎంతో కష్టపడ్డామని, అన్నం వండుకుని దాంట్లో నీళ్లు పోసుకుని తాగిన రోజులు ఎన్నో ఉన్నాయని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: