బుల్లి పిట్ట: త్వరలోనే ఆ కార్ల ని బ్యాన్ చేసే అవకాశం..!!

Divya
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా కార్ల వాడకం పెరిగిపోతుందని చెప్పవచ్చు. వ్యక్తిగత అవసరాలకు కానీ ట్రాన్స్ పోర్ట్ పరంగా కాని ఎక్కువగా కార్లలో డీజల్ కార్లు కొనుగోలు చేస్తున్నారు కస్టమర్స్. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈ డీజిల్ కార్లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కొత్తగా కూడా డీజిల్ కార్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు డీజిల్ కార్ల ఓనర్లు.. సరికొత్త డీజిల్ కార్ కొనాలనుకునే వారికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు..

ఎందుకంటే డీజిల్ కార్లపై బ్యాన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వార్త వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించిన విధివిధానాలను ఆయిల్ మినిస్ట్రీ ప్యానెల్ ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడంతో దేశంలో పలు నగరాలలో గాలి నాణ్యత తగ్గిపోతూ వస్తోందట. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం పలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇప్పుడు మరింత కఠినంగా అయ్యే అవకాశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.2027 తర్వాత డీజిల్ కార్లను బ్యాన్ చేయాలని ఎలక్ట్రిక్ గ్యాస్ వంటి ఆధారిత కార్లను మాత్రమే ఉపయోగించాలని ప్రతిపాదనను తీసుకువచ్చింది.

ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా విన్న సంచలనాలను రేపుతున్నాయి..ఎందుకంటే దేశంలో మెజర్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఎక్కువగా డీజిల్ మీదే ఆధారపడింది. డీజిల్ బ్యాన్ చేస్తే ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి డీజిల్ మోడల్ బస్సులను కూడా చేర్చకూడదని సూచించారు. అందుకే వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం పది లక్షల జనాభా నుంచి జీవిస్తున్న అన్ని సిటీలలో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలని డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఎలక్ట్రిక్ వైపు పెట్రోల్ ధరలు అధికంగా ఉండడంతో వాటి వైపు మగ్గు చూపడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: