బుల్లిపిట్ట:1,150 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ ఇదే..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన టెక్ మార్కెట్లలో వినియోగదారులకు అనుగుణంగా పలు రకాల మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన మరొక మొబైల్ సంస్థ QUKITEL అని బ్రాండెడ్ నుంచి సరికొత్త మొబైల్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ మొబైల్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది ముఖ్యంగా 64 మెగా పిక్సెల్ IMX 686 సెన్సార్ కలదు ఇక ఇందులోనే 20 మెగా పిక్సెల్ మరొక కెమెరా కలదు. ఈ మొబైల్ పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ మొబైల్ గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయబడింది దీని ధర $280 సుమారుగా రూ.22,825 రూపాయలు ఈ మొబైల్ నవంబర్ 24 నుండి ALIEXPRESS ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందట. ఈ స్మార్ట్ మొబైల్ ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల డిస్ప్లే తో కలదు. AOD కి ఈ స్మార్ట్ మొబైల్ మద్దతుగా నిలుస్తోంది. ముఖ్యంగా వెనుక ప్యానెల్ లో సెకండరీ డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది ఇది నోటిఫికేషన్, మ్యూజిక్ వంటివి మాత్రమే నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
QUKITEL WP21 స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 9,800 MAH సామర్థ్యం తో పాటు 1150 గంటలు స్టాండ్ బై సమయం మరియు 12 గంటల నిరంతరం వీడియో ప్లే బ్యాక్ సమయాన్ని ఉండే విధంగా ఈ మొబైల్ ని తయారు చేశారు. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ 12 GB RAM+256 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు. ఇక ఈ మొబైల్లో సరికొత్త టెక్నాలజీ తో తయారు చేయబడింది. అయితే ఇండియాలో మాత్రం ఈ మొబైల్ ఇంకా విడుదల చేయలేదని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: