హీరో విడా: ఎలా బుక్ చేసుకోవాలంటే?

రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన 'హీరో మోటోకార్ప్' ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' (Vida) కోసం కంపెనీ బుకింగ్స్ రిసీవ్  చేసుకోవడం ప్రారంభించింది.ఇంతకీ బుకింగ్స్ ప్రైస్ ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి? డెలివరీలు ఎప్పుడు అనే మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక హీరో కంపెనీ విడుదల చేసిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి విడా 'వి1 ప్రో' (V1 Pro) కాగా, మరొకటి విడా 'వి1 ప్లస్' (V1 Plus) ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఇంకా రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కింది సూచనలను ఖచ్చితంగా పాటించాలి.ముందుగా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్ కంపెనీ  అధికారిక వెబ్‌సైట్ https://www.vidaworld.com/ ఓపెన్ చెయ్యాలి.వెబ్‌సైట్ ఓపెన్ అయిన తరువాత హోమ్‌పేజీలో, వెహికల్ ఇంకా వేరియంట్‌ ఎంచుకోవాలి.


ఆ తరువాత కంటిన్యూపై క్లిక్ చేయగానే మీరు కొత్త పేజీలోకి వెళతారు.ఇక చివరగా మీ పర్సనల్ డీటైల్స్ నమోదు చేసుకుని, బుకింగ్ చేసుకోవడానికి కంపెనీ నిర్దేశించిన మొత్తాన్ని (రూ. 2,499) చెల్లించాలి.హీరో మోటోకార్ప్ మొదట్లో వెల్లడించిన సమాచారం ప్రకారం, విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రస్తుతం ఢిల్లీ, జైపూర్ ఇంకా బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించనుంది. ఆ తరువాత మిగిలిన నగరాల్లో ప్రారంభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లలకు డెలివరీ డిసెంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి.హీరో విడా స్కూటర్ మోడ్రన్ డిజైన్ ఇంకా అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి కలర్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. అందువల్ల Vida V1 Plus మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్ ఇంకా గ్లోస్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: