టెక్నాలజీ: మార్కెట్లోకి దోశను తయారు చేసే ప్రింటర్?

బ్రేక్ ఫాస్ట్ లలో చాలా మందికి కూడా ఫెవరేట్ టిఫిన్ దోశ. చాలా రుచికరంగా ఉంటుంది.కానీ ఆ రుచికరమైన దోశను చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది.దానికి ముందు రోజే పిండి రుబ్బి నానబెట్టుకోవాలి.ఇక ప్రెజెంట్ జనరేషన్ లో అయితే మార్కెట్లో ఇన్‌స్టంట్ దోశ పిండి కూడా లభిస్తోంది. ఆ పిండి తెచ్చుకొని ప్యాన్ పైన దోశలువేసుకుంటే చాలు. పని ఈజీగా అయినట్టే. కానీ టెక్నాలజీ పెరిగిపోయినకొద్దీ అన్ని పనులూ ఈజీగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి దోశలు వేసుకోవడం కూడా చేరిపోయింది. మామూలుగా దోశ చేయాలంటే పిండిని ప్యాన్ మీద వేయాలి. ఆ తర్వాత బాగా వేగాక దించేయాలి. కానీ ఆ అవసరం లేకుండానే దోశలు చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా?అందుకోసం దోశ ప్రింటర్  వచ్చేసింది.చెన్నైకి చెందిన ఇవోచెఫ్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ మెషీన్ చూడ్డానికి ప్రింటర్ లాగానే ఉంటుంది. అందులో ఓవైపు నుంచి పిండి పోస్తే మరోవైపు నుంచి దోశలు ప్రింటయి వస్తాయి. ఈ ప్రింటర్ ద్వారా కరకరలాడే దోశలు ప్రింట్ అవుతున్నాయి. ఇందులో దోశ ఎంత మందంలో ఉండాలి, ఎంత సమయంలో కావాలో సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక బటన్లు కూడా ఉన్నాయి.


ఈ దోశ తయారీలో నెయ్యి, వెన్న, చీజ్ వంటి అదనపు పదార్ధాలను కూడా జోడించవచ్చట.'ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ దోస తయారు చేసే మెషిన్ గా పేరు పొందిన ఈ పరికరం పేరు ఈసీ ఫ్లిప్ గా నామకరణం చేశారు. కాగా దీని ధర రూ.15,999 అని కంపెనీ వెబ్ సైట్ ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఇది ఒకే సారి 10నుంచి12 సన్నని దోసెలు లేదా 6 నుంచి 8 మందపాటి దోసెలు తయారు చేయగలదని కంపెనీ పేర్కొంది.  ఈ ఐడియా ఏదో బాగుందే అని అనిపించినా... ఈ టెక్నాలజీపై ఆన్‌లైన్‌లో సెటైర్లు వస్తున్నాయి. ఇలాంటి గ్యాడ్జెట్స్, మెషీన్లు మానవ జీవితం సులభతరం చేస్తుందన్న విషయం తెలుసుకానీ, మరీ ఈ రకమైన టెక్నాలజీ వస్తుందని అనుకోలేదని నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో రోటీ మేకర్స్, డిష్ వాషర్స్ లాంటివి ఎన్నో గ్యాడ్జెట్స్, అప్లయెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దోశ ప్రింటర్ రావడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: