బుల్లి పిట్ట: రూ.999 లకె సౌండ్ బార్..!!

Divya
ప్రస్తుతం ఇండియాలో కూడా ఎక్కువగా సౌండ్ బార్లను వినియోగిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు భారతదేశంలో బాగా విస్తరిస్తున్న ఆడియో బ్రాండెడ్లలో PTRON అని లేటెస్ట్ సౌండ్ బార్ సిస్టమ్ కూడా ఒకటి. ఇది ప్రస్తుతం బాగా పాపులర్ గా మారుతోంది. ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా ఓటీటి లో సినిమాలు చూస్తూ ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో హోమ్ థియేటర్ సౌండ్ కోసం భారీగా సౌండ్ బాక్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అందుచేతనే PTRON సౌండ్ బార్ ఇండియాలో ప్రవేశించినట్లు ఆ కంపెనీ తెలియజేసింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ సౌండ్ బార్ కేవలం కస్టమర్ల కోసం రూ.1000 రూపాయల కంటే తక్కువ ధరకే విడుదల చేయడం గమనార్హం. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ విషయానికి వస్తే..PTRON (MUSICBOT EVO)ను చాలా స్టైలిష్ సొగసైన డిజైన్తో మరియు సరికొత్త టెక్నాలజీతో విడుదల చేయడం జరిగింది. ఈ సౌండ్ బ్యాటరీతో లభిస్తుంది. మరియు 10 గంటల ప్లే బ్యాక్ ను కూడా ఈ సౌండ్ బార్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ TV,TAB, LAPTOPES వంటి వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ వివరాల్లోకి వెళితే ఈ సౌండ్ బార్లు బ్లూటూత్ ద్వారా కూడా పనిచేస్తుంది చాలా సులువుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ 10W స్పీకర్లు కలవు. ఇక ఈ సౌండ్ బార్ లో అధునాతిన టెక్నాలజీ తో కూడా తయారు చేయబడింది. ఇందులో యూఎస్బీ డ్రైవ్, టిఎఫ్ కార్డ్ , తదితర మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా కలవు. ఈ సౌండ్ బార్ ఆగస్టు 23 నుంచి ఫ్లిప్ కార్ట్ లో కూడా లభిస్తుంది. ఎవరైనా తమ ఇంటిని థియేటర్ గా మార్చుకోవాలి అనుకునేవారు వీటిని తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: