అంతు చిక్కని రహస్యాలు.. విశ్వం నుంచి అరుపులు..!

MOHAN BABU
విశాలమైన ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. మనిషి ఒంటరి జీవి కాదని విషయంలో మరో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా సుమారు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే రేడియో తరంగాలను విడుదల చేస్తున్న వస్తువును ఇప్పటికీ గుర్తించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రేడియో తరంగాలు ఏదైనా నక్షత్రం నుంచి వస్తున్నాయా లేదంటే మరేదైనా వస్తువు నుంచి వస్తున్నాయా అనేదానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను నాచర్ అనే పత్రికలో ప్రచురించారు. ఖగోళంలో మునుపెన్నడూ చూడనిఈ వింత గురించి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధిస్తున్నారు. స్పేస్ లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తుందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. ఎవరైనా బుద్ధిజీవులు అక్కడినుంచి తమ లొకేషన్ ను కాంతి ప్లాషింగ్ చేస్తూ తెలియచేస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. అయితే దీనిని కనిపెట్టింది ఏ సీనియర్ శాస్త్రజ్ఞుడో అయితే వేరే విషయం. కానీ దీనిని కనిపెట్టింది డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దాన్ని గుర్తించాడు. టెలిస్కోప్ సాయంతో దాన్ని గుర్తించగా అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నేటార్ అని దానికి పేరు పెట్టాడు. ఆ వింత వస్తువు ఏంటని తేల్చే పనిలో ఉన్నారు నటాషా హార్లీ వాకర్ అనే భౌతిక శాస్త్రవేత్త. భూమికి నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత కాంతి అందంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటినుంచో అది పాలపుంత లో ఉండి ఉండొచ్చని, అయితే ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నల్స్ ఏలియన్స్ పనేనని అనుకున్నారు.

కానీ అంతా విశ్లేషించాకా ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు మరింత మిస్టరీ గా మారాయి. అయితే కొందరు మాత్రం అవి కృత్రిమ సిగ్నల్ అయి ఉండే అవకాశమే లేదని సహజంగా వస్తున్నవే నని ఒక అంచనాకు వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్ గా భావిస్తున్న ఆ వింత వస్తువును భారీ  నక్షత్రం బద్దలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుక పై జరుగుతున్న పరిశోధనకి ఎంతో సహాయం చేసినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: