ఏపీని వదలని తుఫానులు.. ముప్పు తప్పదా..!

MOHAN BABU
ఇప్పటికే మొన్నటివరకు కురిసిన వర్షాలకు విలవిల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ఒక ముప్పు  తరుముకొస్తోంది. అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఏపీపై  తన ప్రభావం చూపనుంది. ఈరోజు నుండి  ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈరోజు పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిస్సాల మధ్య తీరానికి దగ్గరగా చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తర్వాత ఇది భారీ తుఫానుగా మారి పెను బీభత్సం సృష్టిస్తుందని వాతా వరణ శాఖ చెబుతూ వస్తోంది.

 ఈ యొక్క ముప్పు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం చూపుతు ఉందని ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ యొక్క జావాద్ తుఫానుకు వాతావరణం పూర్తిగా మరి పోయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఏది ఏమైనా  ఇప్పటికే వరద ధాటికి కడప, కర్నూలు, ఇతర జిల్లాలు తీవ్రంగా నష్టపోయారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం  ఈ వరద బీభత్సం చాలా భయానక పరిస్థితులు తీసుకువచ్చింది. చూస్తూ ఉండగానే ఇళ్లు కూలిపోయాయి. తీవ్రమైన పంటనష్టం రోడ్లు భవనాలు అన్ని పాడైపోయాయి.  అలాగే తిరుపతిలో ఈ వరదల ధాటికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాని నుంచి కోలుకోకముందే మళ్లీ జావిద్ రూపంలో మరో తుఫాను గండం ఏపీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుస బీభత్సలతో ఏపీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. దీనిపై ముందస్తుగా  స్పందించి నటువంటి ఏపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ సహాయక చర్యలు అందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, హెల్ప్లైన్ సెంటర్లను, ఎవరు కూడా సందర్శకులు రావొద్దని, మ్యచ్యకారులు  ఎవరైనా తీర ప్రాంతాలకు వేటకు వెళ్లొద్దని, ప్రజలకు జాగ్రత్తలు తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: