పాక్ చైనాలపై సరికొత్త ఆయుధం.. భారత్ బార్డర్ దాటితే చుక్కలే..!

MOHAN BABU
తగ్గేదే లేదు అంటోంది భారత్. శత్రువులను ఎదుర్కోవడంలో రాజి లేదంటోంది. 8 సింగిల్ గా  వచ్చిన, గ్రూపులు కట్టచ్చిన భయపడేదే  లేదు అంటుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో రెచ్చిపోతున్న సమయం లో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. తాజాగా దుష్ట ద్వయం పై ఆకాశ్  అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా సై.. బార్డర్ దాటితే బూడిదే.గురి తప్పదు శత్రువును సరిహద్దు దాట నివ్వదు.. కయ్యానికి కాలుదువ్వేతే, ఖేల్   ఖథమే.. పాక్, చైనాల ను పరిగెత్తించి ఆయుధం. దుష్ట ద్వయం పై ఆకాశ్  అస్త్రం. పరిస్థితులు మారుతున్నాయి అందుకు తగ్గట్టుగానే భారత్ బలం పెంచుకుంటుంది. శత్రువు నక్కల కాచుకు  కూర్చున్నాడు అప్రమత్తతో ఎదుర్కొనే ఆయుధబలం రెట్టింపు చేసుకుంటుంది. భారత్ ఇప్పుడు మునుపటిలా కాదు. శత్రువు ఎదురుగా వచ్చిన, దొంగ దెబ్బతీయాలని చూసిన ఎదుర్కొనే సత్తా నింపుకొని ఉంది.

పక్కలో బళ్ళల్లా  మారిన చైనా,  పాక్ ల తోక కత్తిరించే  అస్థ్రాలతో రెడీగా ఉంది. ఇకపై బార్డర్ దాటాలంటే శత్రు సైన్యం ఒకసారి ఆలోచించాల్సిందే. కయ్యానికి కాలు దువ్వాలంటే ఒకటికి రెండు సార్లు తమ  శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవాల్సిందే. ఎందుకంటే భారత్ ఇప్పుడు అగ్రరాజ్యాల ను తలపించేలా ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ సామర్ధ్యం ఉన్న ఆయుధాలను తయారు చేసుకుంటుంది. కొత్త అస్త్రాలను సిద్ధం చేయడమే కాదు అమ్ముల పొదిలోని ఒక్కో ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటుంది భారత్. నియంత్రణ రేఖ మధ్య చైనా, పాకిస్తాన్ తోక జాడింపు లను ఎదుర్కొనేలా రాటు దేలుతోంది. ఆత్మ నిర్భర్  భారత్ మిషన్ తో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు పాక్,  చైనా దుష్ట ద్వయం పై ఆకాష్ అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్ మిస్సైల్ కొత్త వర్షన్ ఆకాష్ ప్రైమ్ ను అద్భుతంగా ప్రదర్శించింది.

ఆకాష్ ప్రైమ్ మిస్సైల్ తొలి విమాన పరీక్షలో శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయగలిగేది. క్షిపణి ప్రయోగం విజయవంతం తో డి ఆర్ డి ఓ సభ్యులు రక్షణ దళాన్ని అభినందించారు. ప్రపంచ స్థాయి క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, రూపకల్పన,  ఉత్పత్తిలో డి ఆర్ డి ఓ సామర్థ్యాన్ని రుజువు చేసినట్లు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. క్షిపణి వ్యవస్థ తాజా వెర్షన్ త్రివిధ సాయుధ దళాలు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్వాసాన్ని మరింత పెంచుతుందని డి ఆర్ డి ఓ చైర్మన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: