బుల్లి పిట్ట : మొట్టమొదటి సోలార్ బోట్ అక్కడే ..?

Divya
ఇప్పటివరకు సోలార్ తో పని చేసే.. చాలా వస్తువులను, వాహనాలను మనం చూసే ఉంటాం.. సోలార్ ఉపయోగం వల్ల విద్యుత్ తక్కువగా ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా చాలా విద్యుత్ వినియోగించబడే పరిసరాలలో , ఈ సోలార్ ప్యానల్ ని పెట్టి విద్యుత్ ను ఆదా చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో, తొలిసారిగా సౌరశక్తితో బోటును నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కేవలం విద్యుత్ మోటార్ తో మాత్రమే నడిచిన ఈ పడవలు, ఇకపై సౌరశక్తితో నడుస్తాయి అన్నమాట..
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని వైసీన్, మునాంబం నుండి ఈ సోలార్ ఫిషింగ్ బోట్లు డిసెంబర్ నుండి ప్రారంభం కానున్నాయట. ఇక సోలార్ బోట్లను బ్రిటిష్ పెట్రోలియం కంపెనీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సెల్ ఫౌండేషన్ నుంచి వచ్చిన నిధుల సహాయంతో, ఎలక్ట్రిక్ బోట్స్, నవాల్ట్ సోలార్ పేరుతో 5 స్టార్టప్ పడవలను తయారు చేశారట. ఈ సోలార్ ఫిషింగ్ బోట్  గురించి అలాగే నవాల్ట్ CEO సందీప్ తాండాశేరి మాట్లాడుతూ.. ముఖ్యంగా మన భారత దేశంలో 2.5 లక్షల ఫిషింగ్ బోట్స్ వున్నాయి. ఇక వీటి నుంచి సుమారు 1.13 కర్బన ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి.
ఇకపోతే 2500 లీటర్ల ఇంధనం.. ఈ చిన్న పడవలకు సంవత్సరానికి ఖర్చవుతోంది. ఇక సుమారు ఇన్ని వేల లీటర్ల తో పడవలు నడపడం వల్ల,  ఐదు నుంచి ఆరు టన్నుల కార్బన్ ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి. వీటి వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం కూడా పడుతోంది. పర్యావరణాన్ని కలుషితం చేయకూడదని.. ఒక ఆలోచనతోనే మా సంస్థ సౌరశక్తితో పడవలను తయారు చేయనుంది అంటూ ఆయన తెలిపారు..
ఇకపోతే వీటి ఒక్కొక్క ధర 10 లక్షల రూపాయల వరకు ఉంటుందట. మత్స్యకారులు ఒక వేళ ఈ పడవలను కొనుగోలు చేయాలని అనుకుంటే, ఏడున్నర లక్షల రూపాయలు ముందుగా చెల్లించి, ఆ తర్వాత రెండున్నర లక్షల రూపాయలకు ఈఎంఐ కట్టవచ్చు. సాధారణంగా సోలార్ ఫిషింగ్ బోట్ 25 లక్షలు ఉంటే, దానిని నవాల్ట్ సంస్థ 10 లక్షల రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఇక ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర రాష్ట్రాల కూడా ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.. విద్యుత్ పడవలు నాలుగు లక్షలు ఉండగా , దీనిని లక్ష రూపాయలకే విక్రయిస్తామని సీఈవో సందీప్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: