స్మార్ట్ ఫోన్ కెమెరాతో బాక్టీరియాని ఈజీగా కనిపెట్టొచ్చు...

మన చుట్టూ ఎన్నో కోటాను కోట్ల బాక్టీరియా ఉంటుంది.ఇక చెడు బాక్టీరియాను కనిపెట్టడం మాట అటుంచితే కనీసం దానిని చూసే అవకాశమే లేదు. ఒకవేళ గనుక మనకి ఈ ప్రమాదకరమైన చెడు చేసే బాక్టీరియా కనిపించిందంటే ఎలా ఉంటుంది. ఇక చాలా వరకూ బాక్టీరియాతో వచ్చే రోగాలు నుంచి రక్షణ దొరికి బయట పడినట్టే. ఇక ఎక్కడ చెడు బాక్టీరియా ఉంటే అక్కడ దానిని చంపేసి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. ఇక మనకి చెడు చేసే బాక్టీరియాని చాలా ఈజీగా కనిపెట్టొచ్చట. ఇక ఆ చెడు బాక్టీరియా కనిపించే విధంగా స్మార్ట్ ఫోన్ కెమెరా రూపొందిస్తున్నారు సైంటిస్టులు.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కెమెరాతో కూడా బ్యాక్టీరియాను చాలా గుర్తించవచ్చు అంటున్నారు సైంటిస్టులు. అమెరికన్ సైంటిస్టులు మొబైల్ కెమెరాను కొద్దిగా మార్చారు.ఇక దానిని LED బ్లాక్ లైట్ తో సైంటిస్టులు అనుసంధానించారు. ఈ స్మార్ట్ కెమెరాతో మనిషి నాలుక స్కాన్ చేసి చూశారు. ఈ సమయంలో, పళ్ళపై బ్యాక్టీరియా మెరుస్తూ కనిపించింది. ఇక సేమ్ అదే విధంగా మొటిమల బ్యాక్టీరియాను కూడా దాని సహాయంతో చూడవచ్చని అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో తేలింది.
ఇక దీనిని తయారు చేసిన వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు దీనిని ఇంట్లో పరీక్షించగలుగుతామని చెబుతున్నారు.ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాలందరు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారు. అందువల్ల ఇది చాలా ఈజీ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలాగే ఇవి ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటాయనీ అదేవిధంగా బ్యాక్టీరియాను కనిపెట్టడం వారికి చాలా సులభం అవుతుందనీ అంటున్నారు. ఈ పరికరం సహాయంతో, ఇంట్లో ఉన్నవారు బ్యాక్టీరియా ఉందో లేదో చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు.చర్మం ఇంకా నోటి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకుడు డాక్టర్ రుయికాంగ్ వాంగ్ చెప్పారు. నోటిలోని పళ్ళు ఇంకా చిగుళ్ళలోని బాక్టీరియా గాయాల వైద్యం రేటును తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను పరీక్షించడానికి 3 డి రింగ్ మొబైల్ కెమెరాలో 10 ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు సైంటిస్టులు.
బ్యాక్టీరియా అనేది ప్రత్యేకమైన తరంగాలను విడుదల చేస్తుంది.అందుకే ఇది సాధారణ మొబైల్ కెమెరాల ద్వారా పట్టుబడదు. కానీ ఆ బాక్టీరియా తరంగాలు బ్లాక్ ఎల్ఈడి లైట్ ద్వారా గుర్తించడానికి వీలుంది. దీంతో ఈ టెస్టుల్లో అక్కడ బ్యాక్టీరియా ఉందని ఈ పరికరంతో కనుక్కోగలిగారు.ఇక సైంటిస్ట్ డాక్టర్ క్విన్హువా (Qinghua) LED కాంతి వెలిగించి ఉన్నప్పుడు, బాక్టీరియా నుండి రిలీజ్ అయ్యే పోర్ఫిరిన్ అణువు (porphyrin) ఒక ప్రత్యేక రకం ఎరుపు ప్రకాశిస్తూ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పారు. ఇక దీనిని స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా తెలుసుకోగలిగాం అన్నారు. ఒంటి మీద గాయాలు నయం కానప్పుడు చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఈ పోర్ఫిరిన్ అణువు చర్మంపై ఎక్కువగా కనిపిస్తుంది అని డాక్టర్ క్విన్హువా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: