బుల్లిపిట్ట‌: జీమెయిల్‌లో ఎప్పుడైనా వీటిని ఉప‌యోగించారా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!

Kavya Nekkanti

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సేవల్లో జీమెయిల్ ఒకటి. నిజానికి ఆండ్రాయిడ్ ఉపయోగించాలంటే గూగుల్ అకౌంట్ తప్పనిసరి. గూగుల్ అకౌంట్ ఉందంటే జీమెయిల్ కూడా తప్పనిసరిగా ఉండే ఉంటుంది. సో.. జీమెయిల్ సేవలు గురించి తెలియని గూగుల్ యూజర్ అంటూ ఈ ప్రపంచంలో ఉండరు. ఈమెయిల్ వినియోగాన్ని మరింత సౌకర్యంవంతం చేసే క్రమంలో జీమెయిల్ ల్యాబ్స్ అనేక కొత్త ఫీచర్లను జీమెయిల్ సర్వీసులో యాడ్ చేస్తూ వస్తోంది.  15 ఏళ్ల క్రితం మొదలైన జీమెయిల్ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వాడుతుంటారని అంచనా. జీమెయిల్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందిస్తోంది గూగుల్. 

 

వాటి గురించి తెలుసుకుంటే మీరు జీమెయిల్‌ను ఇంకా సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఇందులో ముందుగా జీమెయిల్ ఆఫ్‌లైన్‌.. ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ మెసేజెస్ చదవడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే మీ సిస్టమ్‌లో గూగుల్ క్రోమ్ ఉండాలి. జీమెయిల్ ఆఫ్‌లైన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి enable offline mail పైన క్లిక్ చేస్తే స‌రిపోతుంది. ఎన్ని రోజుల మెసేజెస్ కావాలంటే అన్ని సింక్ చేసుకోవచ్చు.  అలాగే ష‌డ్యూల్ మెయిల్‌.. ఈ ఫీచర్ ద్వారా మీరు ఏ సమయంలో మెయిల్ పంపాలంటే ఆ సమయానికే మెయిల్ చేయొచ్చు. ఇందుకోసం టైమ్ సెట్ చేసుకోవాలి. 

 

ఇలా 100 మెయిల్స్ వరకు షెడ్యూల్ చేయొచ్చు. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత కంపోస్‌ పైన క్లిక్ చేయాలి. మెయిల్ క్రియేట్ చేసిన తర్వాత సెండ్‌ బటన్ పక్కన మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు షెడ్యూల్ చేసిన మెయిల్స్‌ని కూడా డిలిట్ చేయొచ్చు.  ఇక సెల్ఫ్ డిస్ట్రాక్ట్ మెయిల్‌.. మీరు పంపిన మెయిల్‌ కొంతసమయం వరకే ఉండాలనుకుంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఇందులో మీరు ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు షెడ్యూల్ చేయొచ్చు. మీరు సూచించిన సమయం తర్వాత ఆ మెయిల్ మాయమైపోతుంది. దీని కోసం కంపోస్‌ పైన క్లిక్ చేసిన తర్వాత క్లాక్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. అందులో మీరు ఎంత స‌మ‌య‌మో సెట్ చేస్తే స‌రిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: