అయ్య బాబోయ్ ఏటీయం కార్డు ఉపయోగిస్తున్న వారికి బిగ్ షాక్ ?

venugopal

లోకంలో డబ్బుకున్న విలువ మనుషులకు లేదు. విలువున్న డబ్బుకు భద్రత లేదు. మృగాళ్లూ ఆడవాళ్ల మానాలను దోచుకుంటున్నట్లుగా, సైబర్ నేరగాళ్లూ డబ్బులు దోచుకుంటున్నారు. డబ్బు ఇంట్లో ఉంటే భద్రత లేదని బ్యాంక్‌లో దాస్తే వాటికి కూడా భద్రత కరువైంది. ఒంటి మీదున్న నగలు, జేబులో ఉన్న ఏటియం కార్డులు, బ్యాంక్‌లో ఉన్న మని, ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవాలంటే ఉద్యోగాలు మానేసి తుపాకులు పట్టుకుని తిరగవలసి వస్తుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడున్న సమాజాన్ని చూస్తుంటే.

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ అందుబాటులో ఉన్న అన్ని రంగాలపై హ్యాకర్లు దాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ల నుంచి సమాచారం దొంగిలించడం, ప్రముఖ సినిమా స్టూడియోల సర్వర్ల నుంచి షూటింగ్ లో ఉన్న సినిమాల ఫుటేజ్ ని సంపాదించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి అత్యంత చాకచక్యంగా నగదు దొంగిలించడం ఇలాంటి వారికి వెన్నతో పెట్టిన విద్య. అసలు వీరు పుట్టేదే మోసం చేయడానికి అనేలా ఉంటుంది వీరు దోచుకునే స్టైల్...

 

 

ఇక మన దేశంలో కూడా తాజాగా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై హ్యాకర్లు దాడి చేసి, రూ.కోటి వరకు నగదు చోరీ చేశారు. ఈ దోపిడీ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే కార్డ్ స్కిమ్మింగ్ ఉపయోగించి ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంది. అంటే మీ ఏటీయం కార్డు ద్వారానే వారు ఈ నగదు కొట్టేశారన్న మాట..

 

 

ఇకపోతే పోలీసులు ఈ ఘటనలో టర్కీకి చెందిన హ్యాకర్ల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం గుజరాత్ లో ఏటీయం క్లోనింగ్ డివైజెస్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు దొంగిలిస్తూ టర్కీ హ్యాకర్లు పట్టుబడ్డారు. ఈ దోపిడీ విధానం కూడా అలాగే ఉండటంతో పోలీసుల దృష్టి వారివైపు మళ్లింది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే ఎస్ బీఐ ఆఘమేఘాల మీద ఆయా ఖాతాలకు సంబంధించిన ఏటీయం కార్డులను బ్లాక్ చేసింది.

 

 

ఇకపోతే. మీరు కార్డు స్వైప్ చేసినప్పుడల్లా హ్యాకర్లు ఏటీయం మెషీన్ స్కిమ్మింగ్ అటాచ్ చేసిన డివైస్ ద్వారా మీ సమాచారం హ్యకర్లకు చేరుతుంది. దీని ఆధారంగా హ్యాకర్లు మీ కార్డుకు నకిలీ కార్డును తయారు చేస్తారు. అయితే పిన్ ను తెలుసుకోవడానికి హ్యాకర్లు స్పై కెమెరాలను ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఏటీయంల ద్వారా నగదు లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించండని ఇప్పటికే బ్యాంకు అధికారులతో పాటుగా పోలీసు శాఖ వారు ఆదేశాలను జారి చేసారు. సో ఏటియం ఉపయోగించే వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి వారి భారీ నుండి  డబ్బులను రక్షించుకోవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: