'జిమెయిల్' వాడుతున్న వారికి గుండె పగిలే వార్త....!!

Mari Sithara

ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం మనం ఎవరికైనా సమాచారం అందించాలంటే మనకు ఉత్తరాలు అందుబాటులో ఉండేవి. అయితే ఆ తరువాత టెలిగ్రామ్, దాని అనంతరం టెలిఫోన్, ఆపై మెయిల్స్ అనేవి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. అయితే మొదట్లో పలు రకాల మెయిల్ సర్వీసులు అందుబాటులో ఉండేవి. కాగా రాను రాను ఎక్కువమంది గూగుల్ వారి జిమెయిల్ వాడకాన్ని మరింతగా పెంచారు. వ్యక్తిగత మరియు పలు రకాల బిజినెస్ లు చేసేవారికి జిమెయిల్ పలు సేవలు అందించడంతో పాటు ఎంతో రిలయబుల్ గా మరియు ఫాస్ట్ గా ఉండడంతో మెజారిటీ ప్రేక్షకులు జిమెయిల్ నే వాడుతున్నారు. వాస్తవానికి గూగుల్ వారు రూపొందించిన ఈ మెయిల్ సర్వీసులో మొదట్లో కొన్ని బగ్స్ ఉండేవి, అయితే రాను రాను కాల క్రమేణా జిమెయిల్ ని ఎన్నో నూతన రకాల సేవలతో అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. 

 

ఇకపోతే కొన్నేళ్ల క్రితం జిమెయిల్ సర్వీసులు వాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ కొందరు దుండగులు డాక్ ఫైల్ పేరుతో ఒక నకిలీ ఫైల్ ని మనకు తెలిసిన వారు పంపిన విధంగా పంపడం జరిగేది, అయితే ఆ మెయిల్ ఓపెన్ చేయగానే హాయ్ అంటూ ఒక మెసేజ్ దర్శనం ఇవ్వరంతో పాటు మన మెయిల్ డేటా మొత్తం హ్యాకర్స్ కు చేరుతుందని, అటువంటి మెయిల్స్ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని అప్పట్లో గూగుల్ తమ వినియోగదారులను అలర్ట్ చేసింది. అయితే నేడు కొందరు టెక్ నిపుణులు చెప్తున్న దానిని బట్టి చూస్తుంటే, ప్రస్తుతం అదే విధంగా కొందరు హ్యాకర్లు మనలో పాస్వర్డ్ స్ట్రాంగ్ గా నమోదు చేయని వారిని గుర్తించి, అటువంటి వారిని టార్గెట్ చేస్తూ డాక్ ఫైల్స్ ని మెయిల్స్ రూపములో పంపుతున్నారట. 

 

అయితే ఆ ఫైల్ ని ఓపెన్ చేసిన వెంటనే మనకు హాయ్ అంటూ ఒక మెసేజ్ రాగానే మన జిమెయిల్ డేటా అంతా వారికి చేరుతుందట. అయితే ఆ డేటా ద్వారా మన మెయిల్ లిస్ట్ లో ఉన్న వారికి మనం మెయిల్ పంపుతున్నట్లుగానే పలు రిక్వెస్ట్ లు పంపుతూ వారి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ తెలుసుకోవడం వంటి మోసాలకు దిగుతున్నారట. దానితో పాటు మెయిల్ లో భద్రపరిచి ఉన్న డాటాను దొంగిలించి మోసాలకు పాల్పతున్నట్లు సమాచారం. కావున ఇటువంటి డాక్ మెయిల్స్ తో జాగ్రత్త వహించాలని, అటువంటి డాక్ ఫైల్ ఎవరికన్నా మెయిల్స్ రూపంలో వస్తే వెంటనే వాటిని ఓపెన్ చేయకుండా, దానిని గూగుల్ వారికి రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. దీనితో జిమెయిల్ వాడుతున్న వారిలో కొద్దిపాటి భయం తలెత్తుతోంది.....!!    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: