రోజువారి ప్రయాణానికి అందుబాటు లోకి "హైబ్రిడ్ విమానాలు"





ఢిల్లీ ఐఐటీ లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన పూర్వ విద్యార్థి,  భారతీయ నవ యువ పారిశ్రామిక కెరటం  ఆశిష్‌ కుమార్‌, ప్రస్తుతం "మెకానికల్‌ & ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌  విభాగంలో 'కార్నెల్‌ యూనివర్సిటీ'  లో  పీహెచ్‌డీ  చేస్తున్నాడు.  ఆయన "జునూం ఏరో" అనే సంస్థను స్థాపించి దాని సి.ఈ.ఓ.  గా అమెరికా పారిశ్రామిక రంగము లో తనదైన శైలిలో దూసుకెళు తున్నాడు.





ప్రస్తుతం అమెరికా లోని వాషింగ్టన్ రాష్ట్రములోని,   కిర్క్‌లాండ్‌ లో  'జునుమ్‌ ఎరో ' హైబ్రిడ్‌ విమానాలను తయారు చేయబో తుంది. 2013 లో స్థాపించబడ్డ ఈ సంస్థ "కమర్షియల్ హైబ్రిడ్ టు ఎలక్ట్రికల్ ఎయిర్క్రాఫ్ట్" లను ప్రత్యేకించి ప్రాంతీయ ప్రయాణాలను ఉద్దేశించి డిజైన్ చేయబడ్డాయి.   ఇవి  1100కిలో మీటర్ల దూరం నిరంతరాయంగా ప్రయాణించగల" ప్రాంతీయ హైబ్రిడ్-విమానాలు" 2020 నాటికి ఇవి వాణిజ్యానికి సిద్ధంగా ఉంటాయని తెలుస్తుంది.






ఆశిష్‌ కుమార్‌ మాట్లాడుతూ  తమ  "జునుమ్‌ ఎరో"   ప్రాంతీయ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ విమానాలు తయారీ సంస్థ తొలిదశలో  1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల హైబ్రిడ్‌ విమానాలను 2020 వరకు సిద్ధం చేసి,  ఆ తరవాత మలి దశలో  1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల విమానాలను  2030 లోగా తయారు చేయనున్నామన్నారు. ‘బోయింగ్‌, మరియు జెల్‌బ్లూ" అనే విమాన నిర్మాణ సంస్థలు వారిని ప్రోత్సహిస్తున్నాయన్నారు.  ఈ విమానాలను భారతదేశానికి విక్రయించాలని అనుకుంటున్నాడు.



తొలుత 20 సీట్లు ఉండే హైబ్రిడ్‌ విమానాలతో ముందుకువచ్చి  వాటి "ప్రొటోటైప్‌" మరో రెండేళ్లలో తీసుకుగలరని నమ్ముతు న్నామన్నారు.  వీటి వాణిజ్య ఉత్పత్తి  2020 నాటికి  సిద్ధం చేస్తారని తెలుస్తుంది. 



తక్కువ నిర్వాహణ వ్యయం తో లభ్యమయ్యే ఈ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని, ఎందుకంటే ఇవి ప్రయాణించే దూరాన్ని బట్టే ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుందనేది నిర్ణయమౌతుంది. వీటికి వేగం తక్కువ. నిర్వహణ వ్యయం తక్కువ. దగ్గర దూరాలకు ప్రయాణించే వారికి వ్యయం సమయం కలసివస్తాయని తెలుస్తుంది. ఇందువలన అధిక జనాభా అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే తక్కువ దూరాలు మాత్రమే విమాన ప్రయాణాలు అవసరమయ్యే భారత్ లాంటి దేశాలకు ఈ విమానాల తయారీ కలసివచ్చే అంశమని కుమార్ చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: