ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్

Edari Rama Krishna
ప్రపంచంలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రేమిస్తారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ అంటే చాలు టివిలకు అతుక్కు పోతారు.  ఇక టీమ్ ఇండియా క్రికేట్ ఆటగాళ్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి క్రీడాస్ఫూర్తితో ఆడుతూ గెలుపు కోసం పోరాడుతుంటారు.  ఇంటీవల్ ఆస్ట్రేలియాతో జరిగిన ఆటలో ట్రోఫీని దక్కించుకున్న విషయం తెలిసిందే.  అయితే కొంత మంది ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిస్తారన్న విషయం తెలిసిందే. గతంలో ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సంఘటనలు కొన్ని ఉంటాయి.

వాటిలో శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడ్వటం. మ్యాచ్ ముగిశాక హర్భజన్ కొట్టడం.. శ్రీశాంత్ మరోసారి కన్నీటి పర్యంతం కావడం  అప్పట్లో సంచలనం అయ్యాయి.  దాంతో హర్భజన్ ను కొన్ని మ్యాచ్ లు సస్పెండ్ చేశారు.  అయితే అప్పటి సంఘటన హర్భజన్ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయిందట. ఆ సమయంలో భజ్జీ ముంబై ఇండియన్స్ కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించారు. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆ ఘటన తల్చుకుంటే ఇప్పటికీ షాక్ అనిపిస్తుందని..ఒకవేళ తనకు జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టిన ఘటనను మార్చుకుంటానని భజ్జీ తెలిపాడు. తాను అలా చేసుండాల్సింది కాదని, తాను తప్పు చేశానని చెప్పాడు.  శ్రీశాంత్ నాకు మంచి స్నేహితుడు..ఇప్పటికీ కలుస్తూనే ఉంటాం..అతను అద్భుతమైన ఆటగాడు, అతడికి ఎంతో నైపుణ్యం ఉందని కితాబు ఇచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: