“వన్డే చరిత్ర” లో “కోహ్లీ” అరుదైన రికార్డు..

Bhavannarayana Nch

దక్షిణాఫ్రికాతో టెస్టు సీరీస్ మొదలవుతుంది అనుకున్న సమయంలో..సఫారీ టీం కి చెందిన ఫిలాడర్..భారత జట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు..భారత ఆటగాళ్ళ ఏకాగ్రత చెడగొట్టే ప్లాన్ లో అదొక భాగం అయితే తన టార్గెట్ మొత్తం కోహ్లీ పైనే నిలిపాడు..కోహ్లీని మేము ఎప్పుడు ఆటలో వ్యక్తిగా చూస్తాము అని తెలిపాడు..అయితే అలాంటి విమర్సకులకి కోహ్లీ బ్యాట్ తో సామాధనం చెప్పాడు..

 

టెస్టు సీరీస్ తరువాత మొదలైన వన్డే మ్యాచ్ లలలో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు..తాజ్గాగా మరో అరుదైన రికార్డు కోహ్లీ తన సొంతం చేసుకున్నాడు..అంతేకాదు ఈ రికార్డుతో కోహ్లీ తనకి ఎవరు పోటీ కాదు అని మరో మారు నిరూపించుకున్నాడు..తాజాగా ఆరో వన్డేలో చెలరేగి ఆడుతున్నాడు..అయితే ఈ సమయంలో తన వన్డే కెరీర్‌లో 47వ అర్థశతకాన్ని నమోదు చేసుకున్న కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 17,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

 

ఈ రికార్దుతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓ కెప్టెన్‌గా మరియు ఆటగాడిగా నిలిచాడు...కోహ్లీ 6 ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 507 పరుగుల చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు...అయితే ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్‌సన్ 6 ఇన్నింగ్స్‌లో 491 పరుగులు రికార్డును కెప్టెన్ హోదాలో..రోహిత్ శర్మ ఆరు ఇన్నింగ్స్‌లో 491 పరుగుల  రికార్డును ఆటగాడిగా బద్దలుకొట్టాడు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: