"ఇందుకే ఓడిపోయాం"...కోహ్లీ వివరణ.

Bhavannarayana Nch

వరుస విజయాలతో సఫారీల గడ్డపై వన్డే సీరీస్ లో దూసుకుపోతున్న భారత జట్టు 6 వన్దేలకి గాను మూడు వన్డేలు గెలుచుకుని వరుసగా 4 వన్డేలో కూడా గెలిచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంది అయితే అనూహ్యంగా భారత జట్టు వైఫ్యలం చెందింది..దానికి అనేక కారణాలు ఉన్నా భారత్ కెప్టెన్ కోహ్లీ ఓటమికి గల కారణాలని వివరించాడు..ఓటమికి గల కారణంపై కోహ్లీ ఏం చెప్పాడంటే..

 

అయితే సఫారీల గెలుపుకి కొన్ని కారణాలు కలిసొచ్చాయి..తొలుత మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపగా ఆ తరువాత భారత జట్టు తమకి అంది వచ్చిన ఒక్కో అవకాశాన్ని చేజార్చుకుంది..ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఒక్క ఓవర్లోనే రెండు సార్లు అవుటయ్యే అవకాశం తప్పుకుంది..ఈ విషయం భారత జట్టు విజయంపై ప్రభావం చూపింది..కోహ్లీ కూడా ఈ విషయాన్ని ఏకీభవించాడు...ఏబీ అవుటైన తర్వాత మ్యాచ్‌లో విజయం పక్కా అనుకున్నాము కానీ మిల్లర్, క్లాసెన్‌లు మా ఆశల్ని దూరం చేశారని తెలిపాడు.

 

యజ్వేంద్ర చాహ ల్ బౌలింగ్ మిల్లర్ ఇచ్చిన డీప్ స్వ్కేర్ లెగ్‌లో శ్రేయస్ అయ్యర్ వదిలేశాడు. మళ్లి అదే ఓవర్‌లో మిల్లర్ బౌల్డ్ అయినప్పటికీ ఆ బంతి నో బాల్‌గా తేలడంతో అతను మరోసారి అవుట్ ప్రమాదం నుంచీ తప్పుకున్నాడు..దాంతో విజయం మాకు దూరం అయ్యింది అంతేకాదు సరిగ్గా అదే సమయంలో వచ్చిన “వర్షం” కూడా మా విజయాన్ని దూరం చేసింది..దాని కారణంగా మ్యాచ్ ఒక్కసారిగా టీ20 తరహాలో మారిపోయిందని..ఇవే మా పరాజయానికి కారణాలు అని తెలిపారు కోహ్లీ..నాలుగో వన్డేలో జరిగిన పొరపాట్లు తదుపది వన్డేలో జరుగకుండా చూసుకుంటాము అని చెప్పాడు కోహ్లీ  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: