భారత దిగ్గజ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను క్రికెట్ ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్లకు కూడా దడ పుట్టించే విలక్షణమైన బౌలింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అదరగొడుతూ స్టార్ ప్లేయర్ గా వెలుగొందుతున్న బుమ్రా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. చాలా ఇంట్రోవర్ట్. అటువంటి వ్యక్తి జీవితంతో ఓ అందమైన లవ్ స్టోరీ, అంతకన్నా అందమైన వైఫ్ ఉన్నారు. అసలు బుమ్రా లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన వైఫ్ సంజనా గణేశన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంజనా గణేశన్.. టీవీ హోస్ట్. క్రికెట్ మరియు బ్యాడ్మింటన్ ప్రెజెంటర్ గా ఉన్నారు. టీమిండియా ఆడే మ్యాచులతో పాటు ఐపీఎల్ లాంటి బడా టోర్నమెంట్స్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సంజనా ఫుల్ క్రేజ్ సంపాదించింది. అయితే 2013లో బుమ్రా, సంజనా లవ్ స్టోరీ మొదలైంది. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో మొదటిసారి వీరు కలిశారు. స్టార్ స్పోర్ట్స్‌కి యాంకర్‌గా సంజనా వర్క్ చేస్తుండగా, బుమ్రా మ్యాచ్‌లలో పాల్గొంటూ ఉండేవాడు. వాళ్ల పరిచయం అక్కడే ప్రారంభమై, కాలక్రమంలో అది ప్రేమగా మారింది.
బుమ్రా చాలా ప్రైవేట్‌గా వ్యవహరించే వ్యక్తి కావడం వల్ల.. సంజనాతో అతని ప్రేమ వ్యవహారం చాలా రహస్యంగానే సాగింది. 2019లో వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ క్రికెట్ టీమ్ అబుదాబి వెళ్లగా.. అక్కడే సంజనాకు బుమ్రా ప్రపోజ్ చేశాడు. 2021లో పెద్దలను ఒప్పించి ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి చాలా ప్రైవేట్‌గా గోవాలో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు బుమ్రా, సంజనాలకు 2023లో అంగధ్ అనే కుమారుడు జన్మించారు. ప్రస్తుతం తనయుడితో ఈ జంట హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఏమాత్రం ఫ్రీ టైమ్ దొరికినా బుమ్రా, సంజనా, అంగధ్ వెకేషన్ లోనే ఉంటారు.