122 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పాక్!
కెప్టెన్ షాన్ మసూద్ 145 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతనికి బాబర్ ఆజమ్‌తో కలిసి నెలకొల్పిన ఓపెనింగ్ పార్ట్‌నర్ షిప్ గొప్ప మద్దతునిచ్చింది. వీరిద్దరూ కలిసి 205 పరుగులు చేశారు. ఫాలో ఆన్ ఆడిన తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై చేసిన హైయ్యెస్ట్ ఓపెనింగ్ పార్ట్‌నర్ షిప్ ఇదే. బాబర్ ఆజమ్ కూడా 81 పరుగులు చేయగా, సల్మాన్ ఆఘా (48), మహ్మద్ రిజ్వాన్ (41) కూడా తమ వంతు సహకారం అందించారు.
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 478 పరుగులు, ఫాలో ఆన్ ఆడిన తర్వాత దక్షిణాఫ్రికాలో ఏ జట్టు సాధించిన అత్యధిక స్కోరు అని చెప్పవచ్చు అందుకే ఇది ఏకంగా 136 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు 1902లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా 372/7 స్కోరు చేసింది. దక్షిణాఫ్రికాలో ఫాలో ఆన్ ఆడుతూ 400కు పైగా పరుగులు చేసిన తొలి విదేశీ జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
అయితే పాకిస్థాన్ చేసిన ఈ పోరాటం గెలుపుకు సరిపోలేదు. సౌత్ ఆఫ్రికా గెలవడానికి కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం కాగా, కేవలం 7.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ బెడింగ్‌హామ్ విధ్వంసం సృష్టించడంతో దక్షిణాఫ్రికా సునాయాస విజయాన్ని అందుకుంది. బెడింగ్‌హామ్ కేవలం 30 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, వారి రికార్డు బ్రేకింగ్ సెకండ్ ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓటమిపాలైన ఈ మ్యాచ్‌లో షాన్ మసూద్ కెప్టెన్సీ, అతని అద్భుతమైన ఆట మెరుపులు మెరిపించాయి.